భర్త మహాశయులకు విజ్ఞప్తి గ్లింప్స్.. రవితేజకు రెండు ప్రశ్నలు
మాస్ మహారాజా రవితేజ ఈసారి కంప్లీట్ రూట్ మార్చాడు. రొటీన్ యాక్షన్, ఫైట్లు కాదు, పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో సంక్రాంతి 2026 బరిలో దిగుతున్నాడు.;
మాస్ మహారాజా రవితేజ ఈసారి కంప్లీట్ రూట్ మార్చాడు. రొటీన్ యాక్షన్, ఫైట్లు కాదు, పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో సంక్రాంతి 2026 బరిలో దిగుతున్నాడు. సెన్సిబుల్ కథలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు కిషోర్ తిరుమలతో రవితేజ చేస్తున్న RT76 టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. టైటిలే చాలా క్యాచీగా ఉంది: "భర్త మహాశయులకు విజ్ఞప్తి". శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఈ గ్లింప్స్‌తో ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయింది.
ఈ గ్లింప్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఓపెనింగే ఒక ఆశ్రమం, ధ్యానం, తెల్ల బట్టల్లో యోగా చేస్తూ.. "మాస్ రాజా స్పిరిచువల్ మోడ్‌లోకి వెళ్లాడు?" అని అనుకునేలోపే.. కట్. గ్లామరస్ హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ఎంట్రీ. ఆ తర్వాత అసలు మ్యాటర్ స్టార్ట్. 'రామ సత్యనారాయణ' అనే క్యారెక్టర్‌లో రవితేజ.. ఆఫీస్‌లో ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో కనిపిస్తాడు.
అసలు కిక్ అంతా రవితేజ వాయిస్ ఓవర్‌లోనే ఉంది. "నా జీవితంలో ఇద్దరు ఆడవాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు" అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆ ప్రశ్నలకు సమాధానం కోసం గూగుల్, చాట్‌జీపీటీ, జెమిని లాంటి AIలను కూడా వాడేశాడట. బహుశా వాటికి పెళ్లి కాలేదు కాబట్టి అవి తనను ఇంకా కన్‌ఫ్యూజ్ చేశాయని రవితేజ చెప్పడం నవ్వు తెప్పిస్తుంది.
ఇది పక్కా కిషోర్ తిరుమల మార్క్ రైటింగ్. భార్యాభర్తల మధ్య జరిగే కామన్ ఇష్యూస్, మగవాళ్ల ఫ్రస్ట్రేషన్‌ను బేస్ చేసుకుని ఒక హిలేరియస్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేసినట్టున్నాడు. "అనుభవం ఉన్న మొగుళ్లను అడిగాను.. వాళ్లు ఆశ్చర్యపోయారే తప్ప ఆన్సర్ ఇవ్వలేకపోయారు" అనే డైలాగ్‌తోనే సినిమా టోన్ ఏంటో సెట్ చేసేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ కాన్సెప్ట్ గట్టిగా కనెక్ట్ అయ్యేలా ఉంది.
సినిమా మొత్తం ఇలాగే క్లాస్‌గా, సాఫ్ట్‌గా ఉంటుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. గ్లింప్స్ ఎండింగ్‌లో మాస్ మహారాజా ట్రేడ్‌మార్క్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌ను కూడా దించారు. అంటే, ఫ్యాన్స్‌కు కావాల్సిన స్టైల్, డ్యాన్స్ ఉంటాయి, ఫ్యామిలీస్‌కు కావాల్సిన కామెడీ, ఎమోషన్ కూడా ఉంటాయన్నమాట. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కూడా గ్లింప్స్‌కు చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది.
ఓవరాల్‌గా, 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' గ్లింప్స్.. ఒక ఫ్రెష్ వైబ్‌ను ఇచ్చింది. ఇది యాక్షన్ సినిమా కాదు, ఒక కంటెంట్ డ్రైవెన్ ఫ్యామిలీ కామెడీ అని క్లారిటీ వచ్చేసింది. పెళ్లయిన ప్రతీ భర్తకు కనెక్ట్ అయ్యేలా ఉంది. మరి రవితేజను ఆ ఇద్దరు అమ్మాయిలు అడిగిన ఆ రెండు ప్రశ్నలేంటో తెలియాలంటే సంక్రాంతి 2026 వరకు ఆగాల్సిందే.