రవి కిషన్ ధురంధర్ వెనుక ఆసక్తికర బిజినెస్ ట్రెండ్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రాంతీయ సినిమాలకు ముఖ్యంగా భోజ్‌పురి చిత్రాలకు ప్రత్యేకమైన మాస్ ఆదరణ ఉంది. నటుడు రవి కిషన్ భోజ్‌పురి పరిశ్రమలో సూపర్ స్టార్‌గా ఎదిగి అటుపై బాలీవుడ్‌లోనూ తనదైన నటనతో ముద్ర వేశారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రాంతీయ సినిమాలకు ముఖ్యంగా భోజ్‌పురి చిత్రాలకు ప్రత్యేకమైన మాస్ ఆదరణ ఉంది. నటుడు రవి కిషన్ భోజ్‌పురి పరిశ్రమలో సూపర్ స్టార్‌గా ఎదిగి అటుపై బాలీవుడ్‌లోనూ తనదైన నటనతో ముద్ర వేశారు. ఇటీవల ఆయన తన పాత చిత్రాల జ్ఞాపకాలను -పరిశ్రమలోని మారుతున్న వ్యాపార సమీకరణాలను పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రవి కిషన్ గతంలో నటించిన ఒక పాత భోజ్‌పురి చిత్రం `ధురంధర్`. ఆ సినిమా అప్పట్లో సాధారణ విజయాన్ని అందుకుంది. చాలా కాలం తర్వాత ఆ చిత్రం నిర్మాతకు భారీ లాభాలను తెచ్చిపెట్టిందని సరదాగా వ్యాఖ్యానించారు.
ఒక పాత సినిమా విడుదలై ఇన్నేళ్లు దాటిన తర్వాత అకస్మాత్తుగా కోట్ల రూపాయల వసూళ్లను సాధించడం లేదా అంతటి డిమాండ్‌ను సంతరించుకోవడం అనేది సినిమా ఇండస్ట్రీలోనే అరుదైన పరిణామం. ఈ మార్పు వెనుక బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ బ్లాక్‌బస్టర్ సినిమా ప్రభావం ఉందనే కోణం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. బాలీవుడ్‌లో ఒక పెద్ద స్టార్ సినిమా ఘనవిజయం సాధించినప్పుడు దానికి మూలమైన ప్రాంతీయ చిత్రాల హక్కులకు అకస్మాత్తుగా మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది.
రణ్‌వీర్ సింగ్ నటించిన `ధురంధర్` చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడంతో.. రవి కిషన్ నటించిన పాత `ధురంధర్` సినిమా డిజిటల్, రీమేక్ .. శాటిలైట్ హక్కుల విలువ ఊహించని విధంగా పెరిగిందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆనాటి పాత చిత్రాల నిర్మాతలు సరికొత్త మార్కెట్ ద్వారా లబ్ధి పొందుతున్నారు.
సినిమా బిజినెస్ ప్రపంచంలో ఏ చిత్రం ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నటులు తమ పాత ప్రాజెక్ట్‌ల విజయాన్ని హ్యూమరస్ కోణంలో చూసినా? ఇది పరిశ్రమలోని సరికొత్త వాస్తవికతను ప్రతిబింబిస్తుంది.
నటుడిగా తాము అప్పట్లో అందుకున్న పారితోషికం కంటే నేడు బాలీవుడ్ క్రేజ్ వల్ల ఆయా పాత చిత్రాల హక్కుల ద్వారా నిర్మాతలు పొందుతున్న లాభాలు ఎక్కువగా ఉంటున్నాయని సీనియర్ నటులు చమత్కరించడం ఇండస్ట్రీలో సహజంగా మారింది. డిజిటల్ యుగంలో కంటెంట్‌కు ఆదరణ విపరీతంగా పెరిగింది. ఒక భాషలోని హిట్ సినిమాను మరో భాషలోకి రీమేక్ చేయడం .. డబ్ చేయడం ద్వారా పాత చిత్రాలకు సరికొత్త మార్కెట్ ఏర్పడుతోంది. ప్రాంతీయ చిత్రాల కథా బలం, వాటిలో ఉండే పక్కా మాస్ ఎలిమెంట్స్ బాలీవుడ్ అగ్ర హీరోలను, దర్శకులను సైతం ఆకర్షిస్తున్నాయి.
ఈ క్రమంలోనే పాత భోజ్‌పురి చిత్రాలకు ఉత్తరాది మార్కెట్‌లో మళ్లీ ఊపు రావడం గమనార్హం. చలనచిత్ర పరిశ్రమలో ఏ కంటెంట్ ఎప్పుడు క్లిక్ అవుతుందో చెప్పడం కష్టం. బాలీవుడ్ అగ్ర తారల చిత్రాల విజయం పరోక్షంగా ప్రాంతీయ చిత్రాల మార్కెట్‌ను.. నాటి నిర్మాతల ఆర్థిక స్థితిగతులను సానుకూలంగా ప్రభావితం చేస్తోంది. మంచి కంటెంట్ ఎప్పుడూ వృధాగా పోదని.. సరైన సమయం వచ్చినప్పుడు తమ విలువను నిరూపించు కుంటాయని తాజా ట్రెండ్స్ నిరూపిస్తున్నాయి.