• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ ప్రేమకు, ఫ్రేమ్ కు...

ఆ ప్రేమకు, ఫ్రేమ్ కు రష్మిక ఎమోషనల్

| గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటున్న రష్మిక మందన గోల్డెన్ టైమ్ ఇప్పుడు గట్టిగానే నడుస్తుంది

By - Tupaki Desk
Update: 2023-11-28 11:46 GMT

గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటున్న రష్మిక మందన గోల్డెన్ టైమ్ ఇప్పుడు గట్టిగానే నడుస్తుంది. ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం సక్సెస్ అవుతోంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఆమె నుంచి మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటిలో ఏ ఒక్కటి సక్సెస్ అయినా కూడా అమ్మడి హోదా మాత్రం మరో ఐదేళ్లపాటు అలా కొనసాగుతూ ఉంటుంది అని చెప్పవచ్చు.


ఇక డిసెంబర్ 1వ తేదీన రాబోతున్న యానిమల్ సినిమాపై కూడా అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో కూడా రష్మిక మంచి సక్సెస్ అయితే అందుకునే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇక అందులో కూడా రష్మిక మందాన చాలా అందంగా కనిపించింది. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఒక ఫ్రేమ్లో మాట్లాడుతూ ఉండగా వెనకాల మహేష్ బాబు ఒకవైపు రణబీర్ మరొకవైపు ఉన్నట్లుగా అక్కడ స్క్రీన్ లో కనిపిస్తుంది. ఆ ఫ్రేమ్ కు రష్మిక ఎంతో ఆనంద పడింది. అంతే కాకుండా మరొక ఫోటోలో అయితే మహేష్ బాబు ఆమెను ప్రేమతో దగ్గరికి తీసుకున్నట్లు ఉంది.

ఇక అందులో కూడా రష్మిక చాలా అందంగా కనిపించింది. ఆ ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ ఫోటోలు తీసిన వారికి కూడా రష్మిక ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. మధురమైన క్షణాలను ఈ విధంగా చూపించినందుకు చాలా థాంక్స్ అని తెలియజేసింది.

నిన్న ఈవెంట్లో ప్రేమతో పాటు ఎంతో గౌరవం అలాగే ఊహించని మ్యాడ్ కొంచెం భయం అలాగే సినిమా కోసం ఎదురుచూపులు ఇవన్నీ కూడా కనిపించాయి. అయితే ఆ క్షణం ఎంతో మ్యాజిక్ గా అనిపించింది. అంతులేని ఆ ప్రేమకు ఎంత కృతజ్ఞతలు చెప్పిన కూడా తక్కువే. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. యానిమాల్ సినిమా మరో మూడు రోజుల్లో సందడి స్టార్ట్ చేయబోతోంది. ఇక అందరూ ఎంజాయ్ చేయాలి అని రష్మిక సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది.

Tags:    
  • Maheshbabu 
  • Rashmika 
  • Animal 
  • Ranbirkapoor 
  • Rashmikamandanna 
  • Sandeepvanga 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS