• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇప్పుడు తన టైం అంటున్న...

ఇప్పుడు తన టైం అంటున్న రష్మిక మందన్నా

| సాధారణంగా అయితే హీరోయిన్‌ లు వరుసగా రెండు ఫ్లాప్స్ ని చవి చూస్తే మరో ఆఫర్‌ ని దక్కించుకోవడం కష్టం

By - Tupaki Desk
Update: 2023-10-12 09:41 GMT

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా కిర్రాక్ పార్టీ సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకుంది. కన్నడం లో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో తెలుగు లో ఛలో సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఛలో సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో గీత గోవిందం సినిమాలో నటించే అవకాశం రావడంతో రష్మిక కెరీర్ పూర్తిగా టర్న్ అయింది. అంతే కాకుండా స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది.

రష్మిక మందన్నా టాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ గా మారిపోయింది. స్టార్‌ హీరోల యొక్క మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా వరుస సినిమాలు చేయడంతో పాటు, తమిళ్ మరియు హిందీ సినిమాల్లో కూడా ఆఫర్లను దక్కించుకుంది. తమిళ్ మరియు హిందీలో ఈమె చేసిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అయినా కూడా అక్కడి నుంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

సాధారణంగా అయితే హీరోయిన్‌ లు వరుసగా రెండు ఫ్లాప్స్ ని చవి చూస్తే మరో ఆఫర్‌ ని దక్కించుకోవడం కష్టం. కానీ నేషనల్‌ క్రష్ గా దూసుకు పోతున్న రష్మిక మందన్నా మాత్రం తమిళ్‌ మరియు హిందీలో వరుస సినిమాలను చేస్తూనే ఉంది. ముఖ్యంగా హిందీలో ఈమె చేసిన యానిమల్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

తాజాగా ఒక చిట్ చాట్‌ లో రష్మిక మందన్నా మాట్లాడుతూ... తినే ప్రతి బియ్యపు గింజ పై మన పేరు రాసి ఉంటుంది అంటారు. అదే నటీ నటులకు కూడా వర్తిస్తుంది. ఏ పాత్ర రాసి పెట్టి ఉంటే ఆ పాత్ర తప్పకుండా వరిస్తుందని రష్మిక చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో మంచి సమయం అనేది వస్తుంది. ఇప్పుడు తనకు మంచి టైమ్ వచ్చింది.

ప్రస్తుతం తనకు నడుస్తున్న గుడ్ టైమ్‌ వల్లే హీరోయిన్ గా మంచి ఆఫర్లు దక్కించుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. తన గుడ్ టైమ్ వల్లే హీరోయిన్‌ గా బిజీగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చిన రష్మిక మందన్నా ముందు ముందు కూడా మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నట్లుగా రష్మిక చెప్పుకొచ్చింది.

Tags:    
  • Rashmikamandanna 
  • Chalomovie 
  • Kannadabeauty 
  • Filmindustry 
  • Animalmovie 
  • Bollywood 
  • Sandeepvanga 
  • Rashmika 

Similar News

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS