• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాప్ 30లో రష్మిక.. మరో...

టాప్ 30లో రష్మిక.. మరో సెన్సేషనల్ రికార్డ్

| ఇక ఇప్పుడు రీసెంట్ గా అమ్మడు మరోసారి ఫోర్బ్స్ లిస్టులో చోటు సంపాదించుకుంది. 30 కంటే తక్కువ వయసు ఉన్న యువతలో అత్యధిక స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంటున్న లిస్టులో రష్మిక కూడా నిలిచించి.

By - Tupaki Desk
Update: 2024-02-15 11:29 GMT

గ్లామరస్ బ్యూటీగా మంచి గుర్తింపు అందుకుంటున్న రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ బ్యూటీకి ఒక ఫ్లాప్ వచ్చినా మళ్లీ వెంటనే మరొక పెద్ద సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. పుష్ప 1 సినిమా తర్వాత ఆమె క్రేజ్ మరింత ఎక్కువ పెరిగిపోయిన విషయం తెలిసిందే.

ఇక రష్మిక కూడా డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్ గ్రోత్ కూడా పెంచుకుంటుంది. వీలైనంతవరకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక ఇటీవల వచ్చిన యానిమల్ కూడా బాక్సాఫీస్ వద్ద సంచల విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రతి ఏడాది ఈ బ్యూటీకి ఏదో ఒక పురస్కారం అయితే లభిస్తుంది.

ఇక ఇప్పుడు రీసెంట్ గా అమ్మడు మరోసారి ఫోర్బ్స్ లిస్టులో చోటు సంపాదించుకుంది. 30 కంటే తక్కువ వయసు ఉన్న యువతలో అత్యధిక స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంటున్న లిస్టులో రష్మిక కూడా నిలిచించి. బిజినెస్ లో అలాగే స్టార్ హోదాలో ఎప్పటికప్పుడు చాలెంజెస్ ఎదుర్కొంటూ చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్న యువతలో మొత్తం 30 మంది పేర్లు ఫోబ్స్ లిస్టులో వచ్చాయి.

ఇక అందులో రష్మిక మందన పేరు కూడా ఉంది. ఈ ఘనతతో అమ్మడి రేంజ్ మరింత పెరిగిపోయింది అని చెప్పవచ్చు. గతంలో సోషల్ మీడియాలో ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్న వారిలో రష్మిక పేరు కూడా టాప్ లిస్టులో నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈసారి ఈ విధంగా అమ్మడు యువతతో పోటీపడుతూ తన ఖ్యాతిని పెంచుకుంది.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ లిస్టులో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప పార్ట్ 2 సినిమా ఏ మాత్రం సక్సెస్ అయిన బాలీవుడ్ లో కూడా టాప్ పొజిషన్లోకి వెళ్లిపోవడం ఖాయం. అంతేకాకుండా అమ్మడు ప్రభాస్ స్పిరిట్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక బాలీవుడ్ లోనే మరో రెండు పెద్ద సినిమాలలో కూడా ఛాన్సులు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరి వాటితో అమ్మడి రేంజ్ ఇంకా ఏ స్థాయిలో పెరిగిపోతుందో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Actress 
  • Rashmikamandanna 
  • Actressrashmika 
  • Forbeslist 
  • Top30 
  • Filmindustry 
  • Nationalcrush 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS