సింగిల్ కాదు మంచి గర్ల్ ఫ్రెండ్ ను -రష్మిక

ఇదిలా ఉండగా ఇటీవల విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని కూడా అభిమానులతో పంచుకోలేదు.;

Update: 2025-10-22 07:38 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా రూమర్డ్ జంటగా పేరు సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. 'గీతాగోవిందం' సినిమాలో తొలిసారి కలిసి నటించిన ఈ జంట.. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' సినిమా చేసి.. తమ పరిచయాన్ని కాస్త ప్రేమగా మార్చుకున్నట్లు సమాచారం. అప్పటినుంచి పలు వెకేషన్ లకి వెళ్లడం.. సినిమా పార్టీలకు హాజరవ్వడం.. పలు ప్రదేశాలలో తిరుగుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ ఎప్పుడూ కూడా తమ బంధాన్ని బయట పెట్టలేదు.

ఇదిలా ఉండగా ఇటీవల విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని కూడా అభిమానులతో పంచుకోలేదు. కానీ నిశ్చితార్థం తర్వాత విజయ్ దేవరకొండ పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడి స్థానికులు ఆయనను గౌరవంగా ఆహ్వానించారు. ఆ సమయం లో కొన్ని ఫోటోలు బయటకు రాగా.. ఆయన చేతి వేలికి ఉన్న ఉంగరంతో నిశ్చితార్థ విషయం కాస్త నిజమయింది. అలాగే మొన్నామధ్య రష్మిక మందన్న షేర్ చేసిన కొన్ని ఫోటోల ద్వారా కూడా ఆమె చేతికి ఉన్న డైమండ్ ఉంగరం బయటపడింది. దీంతో వీళ్ళిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు అటు అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలలు కూడా నిర్ధారణకు వచ్చేశారు.

ఇకపోతే ఈ జంట ఎప్పటికప్పుడు హింట్ ఇస్తున్నారే తప్ప తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక నటించిన చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'. నవంబర్ 7వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రాహుల్ రవీంద్రన్, రష్మిక మందన్న లను రాహుల్ రవీంద్రన్ భార్య, ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఇంటర్వ్యూ చేశారు. అందులో భాగంగానే రష్మికను మీరు సింగిలే కదా అని రాహుల్ అడగడంతో ఆమె ఇచ్చిన సమాధానం అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.

అసలు విషయంలోకి వెళ్తే.. ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. "మీరు సింగిలే కదా అని రాహుల్ అడగగా.. మొదట సిగ్గు పడిపోయిన రష్మిక.. నవ్వుతూ నేను మంచి గర్ల్ ఫ్రెండ్ ని అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే తాను సింగిల్ కాదని తాను కూడా రిలేషన్ లో ఉన్నానని ఈ విధంగా చెప్పేసింది రష్మిక. ఏది ఏమైనా రష్మిక.. విజయ్ దేవరకొండ రిలేషన్ ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇకపోతే ఈ జంట వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కనీసం ఆ రోజైనా ఈ జంట అధికారికంగా ప్రకటిస్తారో లేదో తెలియాల్సి ఉంది.

రష్మిక విషయానికి వస్తే.. ఇటీవల ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా విడుదల చేసిన చిత్రం థామా.. ఈ చిత్రంలో బేతాళ పాత్రలో అదరగొట్టేసింది రష్మిక. అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది.

Tags:    

Similar News