రష్మిక గర్ల్ ఫ్రెండ్.. ఇప్పుడు అసలు పరీక్ష..
నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;
నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రేమ కథా చిత్రంగా యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్, దీక్షిత్ శెట్టి లీడ్ రోల్స్ పోషించారు. రావు రమేష్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు.
అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ.. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో నవంబర్ 7వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజైంది. పోస్టర్స్, టీజర్, ట్రైలర్, హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజిషన్ లో రూపొందిన సాంగ్స్ ఆకట్టుకోవడంతో రిలీజ్ కు ముందు మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఆడియన్స్ నుంచి డీసెంట్ టాక్ అందుకుంది గర్ల్ ఫ్రెండ్ మూవీ. బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లను సాధిస్తోంది. తొలి రోజు ఇండియా వైడ్ గా ప్రీమియర్స్ తో కలిపి రూ.1.3 కోట్లకు పైగా సాధించిన గర్ల్ ఫ్రెండ్ మూవీ.. రెండో రోజు రూ.2.5 కోట్ల వసూలు చేసినట్లు తెలుస్తోంది. అలా రెండ్రోజుల్లో రూ.3.8 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
వరల్డ్ వైడ్ గా రెండ్రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి 6.6 కోట్ల రూపాయలు వసూలైనట్లు తెలుస్తుండగా.. మూడో రోజు భారీ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. రూ.5 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు వినికిడి. ఓవరాల్ గా మూడు రోజుల్లో రూ.10 కోట్ల మార్క్ ను ది గర్ల్ ఫ్రెండ్ మూవీని అందుకుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
అయితే నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఈవెంట్స్ ఖర్చులతో కలిపి రూ.15 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు ఇప్పటికే చెప్పాయి. శాటిలైట్, ఆడియో, ఓటీటీ హక్కులు కలిపి నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ.24 కోట్లు వచ్చినట్లు తెలిపాయి. దీంతో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ లాభాల్లోకి రావాలంటే రూ.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని అంచనా వేశాయి.
అదే సమయంలో ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే ఈ వారం కూడా తన జోరు కొనసాగించాలి. సాలిడ్ కలెక్షన్స్ సాధించాలి. అప్పుడే సేఫ్ జోన్ లోకి వస్తుంది. దీంతో నేటి నుంచి అసలు పరీక్ష మొదలైందనే చెప్పాలి. మరి ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో.. ఎంతటి హిట్ అవుతుందో అంతా వేచి చూడాలి.