నాటి గుర్తులు మర్చిపోగలమా?

తాజాగా సినిమా షూటింగ్ సమయంలో చేసిన అల్లరి.. అందుకు సంబంధించిన ఫోటోలను రష్మిక షేర్ చేస్తూ.. "థామా.. ఈ సినిమా ప్రపంచాన్ని ఎలా వివరించాలి? అసలు ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి?;

Update: 2025-10-22 05:57 GMT

ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న రష్మిక.. తాజాగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం థామా.. హారర్ కామెడీ జానర్లో వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల సందర్భంగా సినిమా జర్నీని అభిమానులతో పంచుకుంది నయనతార. అందులో భాగంగానే సెట్ నుంచి తీసుకున్న కొన్ని బీటీఎస్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. నాటి గుర్తులు మర్చిపోగలమా అంటూ పోస్ట్ చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

 

తాజాగా సినిమా షూటింగ్ సమయంలో చేసిన అల్లరి.. అందుకు సంబంధించిన ఫోటోలను రష్మిక షేర్ చేస్తూ.. "థామా.. ఈ సినిమా ప్రపంచాన్ని ఎలా వివరించాలి? అసలు ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? మొదటి కాల్ షీట్ నుంచి చివరి రోజు కట్ చెప్పే వరకు ప్రతిదీ కూడా మనసుకు హత్తుకున్నదే. మిగతా సినిమాలలోగా కాకుండా ఈ సినిమాలో కేవలం పని మాత్రమే కాకుండా నవ్వులు, గాయాలు, నిద్ర లేవడానికి ఇష్టపడని హృదయాలు, భరోసా, షూటింగ్ ముగించడానికి అంగీకరించని రాత్రులు ఇలా అన్నీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ పై గౌరవంతో నా హృదయం ఒక్కసారిగా నిండిపోయింది. ఆయన నాపై ఉన్న నమ్మకంతోనే ప్రతిదీ కూడా రూపొందించారు. సినిమాలోని ప్రతి సన్నివేశంలో కూడా ఆయన అంకితభావం కనిపిస్తుంది.

 

ముఖ్యంగా సిబ్బంది గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలి. వారి వల్లే మేము షూటింగ్ ను సకాలంలో పూర్తి చేయగలిగాము. ఎత్తైన కొండ ప్రదేశాలకు కూడా పరికరాలను మోసుకు రావడం నన్ను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా షూటింగ్ సమయంలో పడిన కష్టమంతా కూడా సినిమా విడుదలయ్యాక వచ్చిన రిజల్ట్ ని చూసి అంతా మర్చిపోతాము. అందుకే ఈ థామా సినిమా గుర్తులను నేను మర్చిపోగలనా? అంటూ కామెంట్లు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

 

థామా విషయానికి వస్తే స్త్రీ, భేడియా, ముంజ్యా, స్త్రీ 2 లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ దీనిని రూపొందించింది. రష్మిక తో పాటు ఆయుష్మాన్ ఖురానా ఇందులో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా ఎవరికి వారు తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు అని చెప్పవచ్చు.

 

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఒక జర్నలిస్టు. అడవిలోకి అడ్వెంచర్ చేయడానికి స్నేహితులతో కలిసి వెళ్తారు. అక్కడే ఆయనపై ఒక ఎలుగుబంటి దాడి చేస్తుంది. ఇక అతడిని కాపాడడానికి తడఖా (రష్మిక మందన్న) ముందుకు వస్తుంది. అయితే ఈమె మనిషి కాదు బేతాళజాతికి చెందింది. వాళ్ళ నియమాల ప్రకారం మనుషుల రక్తం తాగకూడదు. కానీ వాళ్ళ పూర్వికుడు 'థామా' నాయకుడు అయిన యాక్షసన్ నియమాలకు విరుద్ధంగా.. ఒకసారి మనుషుల రక్తం తాగుతాడు. దాంతో అతడిని వందేళ్లపాటు ఒక గుహలో బంధిస్తారు. తనలా మళ్లీ ఎవరైనా బేతాళుడు నియమం తప్పినప్పుడే యాక్షసానికి విడుదల లభిస్తుంది. అలాంటి సమయంలో అనుకోకుండా తన నియమం తప్పాల్సి వస్తుంది తడఖా. ఆ తర్వాత అసలు ఏమయింది? మధ్యలో బేధియా ఎందుకు వచ్చాడు? అనేదే మిగిలిన కథ. మొత్తానికైతే ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Tags:    

Similar News