రష్మిక మందన్నా.. అల్ట్రా గ్లామర్ లో ఎన్ని హొయలో..

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రష్మిక మందన్నా తన తాజా ఫోటోషూట్‌తో మళ్లీ వైరల్ అవుతోంది.;

Update: 2025-08-06 18:52 GMT

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రష్మిక మందన్నా తన తాజా ఫోటోషూట్‌తో మళ్లీ వైరల్ అవుతోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న పింక్ షూస్, బ్లాక్ డ్రెస్, వైట్ ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో ఉన్న స్టైలిష్ లుక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఆమె వేసుకున్న స్టైలిష్ షూస్, క్యాజువల్ టాప్, కంఫర్ట్ వేర్ స్టయిల్ యువతకు ప్రత్యేకంగా కనెక్ట్ అవుతోంది.

ఈ ఫోటోలలో రష్మిక మోడ్రన్ లుక్స్‌తోపాటు ఫిట్‌నెస్‌ని హైలైట్ చేస్తూ, కొత్త స్టైలింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. ఫ్రెష్ ఫీల్స్, యూత్‌ఫుల్ ఎనర్జీ, న్యాచురల్ విండ్స్… అన్నీ కలిసొచ్చినట్టు ఈ ఫోటోషూట్ కనిపిస్తోంది. ప్యారిస్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఫోటోలన్నీ అంతా ఫ్యాషన్ మ్యాగజైన్స్‌లో చూసేలా ఉన్నాయి. బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ పోజులు, స్మార్ట్ ఎక్స్‌ప్రెషన్స్ ఆమెకు ప్రత్యేకమైన స్టయిల్‌ను తీసుకొచ్చాయి.

రష్మిక మందన్నా కెరీర్ విషయానికి వస్తే, కన్నడలో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, తర్వాత తెలుగులో ‘చలో’, ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘పుష్ప’ వంటి హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్‌ను పాన్‌ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ఇక పుష్ప 2, ఛావా ఆమె కెరీర్లో టాప్ 2 హిట్స్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఓ రెండు సినిమాలతో బిజీగా ఉంది.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా తరచూ తన లైఫ్, ఫిట్‌నెస్, ఫ్యాషన్ గురించిన ఫోటోలు, రీల్స్‌ను పంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరయ్యింది. ముఖ్యంగా స్టైలిష్ ఫొటోషూట్లలో కనిపించే రష్మిక కొత్త ఎక్స్‌ప్రెషన్స్, అవుట్‌ఫిట్ సెలెక్షన్ ఆమెకు ట్రెండ్ సెట్టర్‌గా పేరుతెచ్చాయి. సంప్రదాయ పాత్రలతో పాటు మోడ్రన్ గ్లామర్ లుక్స్‌ను ఇలాంటి ఫొటోషూట్ల ద్వారా చూపిస్తూ రష్మిక మందన్నా తనలోని స్టైలిష్ అటిట్యూడ్‌ను బయటపెడుతోంది. ఫ్యాషన్ ప్రేమికులు ఆమె లుక్స్‌ను ఫాలో అవుతుండగా, ప్రేక్షకుల్లోనూ మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది.

Tags:    

Similar News