ర‌ష్మిక మంద‌న్న ఇక‌పై జియో వ‌ర‌ల్డ్ క్ర‌ష్‌.. ఇదిగో ప్రూఫ్‌!

`నేష‌న‌ల్ క్ర‌ష్‌` లాగా `జియో వ‌ర‌ల్డ్ క్రష్` అని పిల‌వొచ్చా..? ఎందుకు పిల‌వ‌కూడ‌దు.. ఆయిల్ క్రైసిస్, అమెరికా- ఇరాన్ వార్ పుణ్య‌మా అని జియో పాలిటిక్స్ (Gio politics) గురించి భార‌తీయ‌ ప్ర‌జ‌ల్లో విస్త్ర‌త‌మైన‌ అవేర్ నెస్ వ‌చ్చింది.

Update: 2026-05-24 06:16 GMT

`నేష‌న‌ల్ క్ర‌ష్‌` లాగా `జియో వ‌ర‌ల్డ్ క్రష్` అని పిల‌వొచ్చా..? ఎందుకు పిల‌వ‌కూడ‌దు.. ఆయిల్ క్రైసిస్, అమెరికా- ఇరాన్ వార్ పుణ్య‌మా అని జియో పాలిటిక్స్ (Gio politics) గురించి భార‌తీయ‌ ప్ర‌జ‌ల్లో విస్త్ర‌త‌మైన‌ అవేర్ నెస్ వ‌చ్చింది. అందుకే ఇప్పుడు నేష‌న‌ల్ క్ర‌ష్ కాస్తా జియో వ‌ర‌ల్డ్ క్ర‌ష్ గా మారింద‌ని భావించ‌వ‌చ్చు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న `నేషనల్ క్రష్` రష్మిక మందన్న అంతర్జాతీయ వేదికలపై సైతం తన సత్తా చాట‌డం వ‌ర‌ల్డ్ యూత్ ఐకాన్ గా మారింది. ప్రతిష్టాత్మక గ్లోబ‌ల్ ఈవెంట్ `యానిమే అవార్డ్స్ 2026` వేడుకలో ర‌ష్మిక మెరుపులు ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ర‌ష్మిక మ‌రోసారి అంత‌ర్జాతీయ అవార్డుల స్టేజీపై ప్రెజెంటర్‌గా సందడి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాప్ కల్చర్.. యానిమేషన్ రంగాలలోని ప్రతిభను.. సృజనాత్మకతను గౌరవించే ఈ అంతర్జాతీయ ఈవెంట్‌లో రష్మికకు ఆహ్వానం దక్కడం విశేషం. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన హాలీవుడ్ స్టార్లు, టాప్ క్రియేటర్లు, మ్యుజీషియన్లతో కలిసి ర‌ష్మిక‌ ఆరెంజ్ కార్పెట్‌పై నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

రష్మిక మందన్న ఈ ప్రతిష్టాత్మక యానిమే అవార్డ్స్ 2026 వేదికపై ప్రజెంటర్‌గా కనిపించడం ఇది రెండోసారి. ఈ అవార్డుల నైట్‌ కోసం సౌతిండియ‌న్ బ్యూటీ ధరించిన దుస్తులు ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రముఖ డిజైనర్ ప్రబల్ గౌరంగ్ రూపొందించిన బ్లాక్ సీక్విన్డ్ ఆఫ్-షోల్డర్ గౌన్‌లో రష్మిక స్టన్నింగ్ లుక్‌తో మెరిసిపోయింది. పూల డిజైన్లతో కూడిన ఈ హాఫ్ షోల్డ‌ర్ డ్రెస్‌కు మ్యాచింగ్‌గా ఒక అంద‌మైన‌ జెమ్‌స్టోన్ నెక్లెస్‌ను ధరించి గ్లామర్- నేటి జెన్ జెడ్ స్టైలింగ్ తో ఈ అవార్డు వేడుకలోనే ది బెస్ట్ గా త‌నను తాను ఎలివేట్ చేసుకుంది ర‌ష్మిక‌.

కేవలం ఆరెంజ్ కార్పెట్‌పై మెరవడమే కాకుండా... ఈ వేడుకలో అత్యంత కీలకమైన విభాగమైన `బెస్ట్ యానిమేషన్ ఆఫ్ ది ఇయర్` అవార్డును అందించడానికి రష్మిక వేదికపైకి వచ్చారు. పాపుల‌ర్ హాలీవుడ్ నటుడు విన్‌స్టన్ డ్యూక్‌తో చేతులు కలుపుతూ ఈ భామ‌ స్టేజ్ పైకి నడిచి వచ్చిన దృశ్యం ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. వారిద్దరి మధ్య జరిగిన స్టేజ్ ఇంటరాక్షన్... దానికి సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్‌లు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి. అంతర్జాతీయ స్టార్లతో సమానంగా రష్మిక స్టేజ్ మేనేజ్ చేసిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

మరోవైపు రష్మిక మందన్న కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే.. పెళ్లి త‌ర్వాత కొంత త‌న వ్య‌క్తిగ‌త స‌మ‌యానికి ప్రాధాన్య‌త‌నిస్తోంది. థామా, ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాలతో ఈ ఏడాది హిందీ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ర‌ష్మిక ఇకపై బాలీవుడ్ లో న‌టిస్తుందా లేదా వెల్ల‌డించాల్సి ఉంది. భర్త విజయ్ దేవరకొండ సరసన `రణబలి` అనే తెలుగు చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ భారీ చిత్రంపై టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సౌత్ టు నార్త్.. ఆపై గ్లోబల్ లెవెల్ వరకు రష్మిక మందన్న ఎదుగుతున్న తీరు భారతీయ సినిమా గర్వించదగ్గ పరిణామం. ఒకవైపు కమర్షియల్ సినిమాల నాయిక‌గా.. విజ‌య్ స‌హ‌చ‌రిగా గొప్ప గౌర‌వం అందుకుంటున్న ర‌ష్మిక అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై మెరుస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటోంది.

Tags:    

Similar News