• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భారీ భ‌ద్ర‌తా వ‌ల‌యంలో...

భారీ భ‌ద్ర‌తా వ‌ల‌యంలో అత‌డితో ర‌ష్మిక!

| ఓవైపు స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కి గ్యాంగ్ స్ట‌ర్ నుంచి బెదిరింపులు.. మ‌రోవైపు `సికంద‌ర్` షూటింగ్ కోసం అత‌డి చెంత‌నే ర‌ష్మిక మంద‌న్న‌ ఉండాల్సిన ప‌రిస్థితి.

By - Tupaki Desk
Update: 2024-11-05 08:53 GMT

ఓవైపు స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కి గ్యాంగ్ స్ట‌ర్ నుంచి బెదిరింపులు.. మ‌రోవైపు `సికంద‌ర్` షూటింగ్ కోసం అత‌డి చెంత‌నే ర‌ష్మిక మంద‌న్న‌ ఉండాల్సిన ప‌రిస్థితి. బెదిరింపులు, భారీ భ‌ద్ర‌తా అధికారులు ఉన్న చోట‌ అస‌లు ర‌ష్మిక మంద‌న ప‌రిస్థితేంటి? 100మంది సెక్యూరిటీ మ‌ధ్య‌ ఇలాంటి హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణంలో ర‌ష్మిక ఏమ‌ని ఫీల‌వుతోంది? ఏమో కానీ.. హైద‌రాబాద్ ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ ప‌రిస‌రాల్లో షూటింగ్ వెద‌ర్ ఒక్క‌సారిగా వేడెక్కింది.

ఇంత‌కుముందు ముంబై షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత స‌ల్మాన్ -ర‌ష్మిక‌- మురుగ‌దాస్ బృందం తదుపరి దశ చిత్రీక‌ర‌ణ‌ కోసం హైదరాబాద్‌కు వ‌చ్చారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్ నుండి తెరవెనుక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల‌లో వైరల్ అవుతున్నాయి. అయితే వీటిని గ‌మ‌నిస్తే భారీగా షూటింగ్ స్పాట్ కి త‌ర‌లి వ‌చ్చిన‌ జనాలు చారిత్రాత్మ‌క‌ ప్యాలెస్ వెలుపల గుమిగూడినట్లు క‌నిపిస్తోంది. ఆన్‌లైన్ లో క‌నిపించిన‌ వీడియోలో ఒకదానిలో రష్మిక మందన్న త‌న స‌న్నివేశం కోసం ప్రిపేర్ అవుతూ క‌నిపించింది. ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్‌లో ఒక డోర్ వ‌ద్ద‌ నిలబడి ఉంది. ఈ తెరవెనుక వీడియో ఫుటేజ్ అభిమానులను ఆకర్షించింది. ఇక ఇదే వీడియోలో ప‌దుల సంఖ్య‌లో కార్లు కూడా స‌న్నివేశంలో క‌నిపిస్తున్నాయి. ఆస‌క్తిక‌రంగా ప్యాలెస్ వ‌ద్ద స‌ల్మాన్ ఒక‌ అభిమానితో పోజులిచ్చిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సికంద‌ర్ లో స‌ల్మాన్ ప‌వ‌ర్ ఫుల్ రాజ‌వంశ‌స్తుడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ని ఈ ఫోటోల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమాలో భాయ్ భారీ య‌క్ష‌న్ ఎపిసోడ్స్ లో శ‌త్రువులను భీక‌రంగా ఢీకొడ‌తాడ‌ని, వారి పాలిట సింహ‌స్వ‌ప్నంగా మార‌తాడ‌ని కూడా చెబుతున్నారు.

`టామ్ క్రూజ్ మిషన్: ఇంపాజిబుల్` యాక్షన్ సన్నివేశాలకు ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసిన యాక్ష‌న్ డైరెక్ట‌ర్ సికంద‌ర్ కు ప‌ని చేస్తున్నార‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయ‌. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో నదియాద్వాలా గ్రాండ్‌సన్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మించిన సికందర్ ఈద్ 2025 కానుక‌గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రతీక్ బబ్బర్, శర్మన్ జోషి, కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స‌త్యరాజ్ ఇందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. సౌత్ మార్కెట్లో ప్ర‌భావం చూపించేందుకు సికంద‌ర్ లో ర‌ష్మిక‌, స‌త్య‌రాజ్, కాజ‌ల్ వంటి వారికి కీల‌క పాత్ర‌ల్లో అవ‌కాశాలు క‌ల్పించారు. సౌత్ ద‌ర్శ‌కుడే అయిన మురుగ‌దాస్ ఈ సినిమాని పాన్ ఇండియాలో బిగ్ హిట్ గా మ‌లిచేందుకు త‌న‌వంతు హార్డ్ వ‌ర్క్ చేస్తున్నార‌ని స‌మాచారం.

తాజా బెదిరింపుతో హై అలెర్ట్:

ఓవైపు సికంద‌ర్ షూటింగ్ లో పాల్గొంటున్న స‌ల్మాన్ కి ఇప్ప‌టికే ప‌లుమార్లు గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపు ఎదురైంది. తాజాగా అందిన స‌మాచారం మేరుకు అత‌డు ఐదు కోట్లు చెల్లించాలి లేదా బిష్ణోయ్ కుల ఆరాధ్య దైవానికి జోధ్ పూర్ గ్రామంలోని ఆలయంలో క్ష‌మాప‌ణ‌లు కోరుకోవాలి... లేదంటే స‌ల్మాన్ ని చంపేస్తామ‌ని మ‌రోసారి వార్నింగ్ మెసేజ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ కేసుపై విచార‌ణ సాగుతోంది. అయితే స‌ల్మాన్ కి బెదిరింపులు ఎదుర‌వ్వ‌డంతో ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ వ‌ద్ద భారీ భ‌ద్ర‌త‌ను పెంచార‌ని జాతీయ‌ మీడియా క‌థ‌నాలు వండి వారుస్తోంది.

#Sikandar shoot in Hyderabad Falaknuma palace 🎬🔥🔥Royal celebration scenes getting filmed here 📽️🏯👑 #SalmanKhan #EID2025 pic.twitter.com/ZbsTzo7ZEm

— Mohammed Sohail ♐ (@ItsSohailM) November 4, 2024
Tags:    
  • Sikandarmovie 
  • Salmankhan 
  • Rashmikamandanna 
  • Falaknumapalace 
  • Sikandarshooting 
  • Rashmika 
  • Lawrencebishnoi 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS