గర్ల్‌ఫ్రెండ్ ‘నధివే’.. రష్మిక మాయతో నెంబర్ వన్ ట్రెండింగ్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘నధివే’ ఇప్పుడు సంగీత ప్రియుల్లో హాట్ టాపిక్ గా మారింది.;
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘నధివే’ ఇప్పుడు సంగీత ప్రియుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ లిస్ట్‌లో ఎంట్రీ ఇచ్చి, యువతను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే సినిమా టీజర్, పోస్టర్స్ ద్వారా మంచి బజ్ క్రియేట్ కాగా, ఇప్పుడు ‘నధివే’ పాట ఆల్బమ్‌పై మరింత హైప్ తెచ్చింది. యూట్యూబ్ మ్యూజిక్ న్యూ మ్యూజిక్ తెలుగు ప్లే లిస్ట్‌లో #1 ట్రెండింగ్ పాటగా నిలిచింది. ఈ రొమాంటిక్ మెలోడీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, రకెందు మౌళి రాసిన లిరిక్స్ పాటను మరింత హార్ట్ టచింగ్‌గా చేశాయి. హేషమ్ స్వయంగా ఆలపించిన ఈ పాటలోని మెలోడీ ట్యూన్ కూడా హైలెట్ అయ్యింది.
ఈ పాటలో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా కనిపించగా, వీరి మధ్య కెమిస్ట్రీ స్పెషల్ హైలైట్‌గా నిలిచింది. డ్యాన్స్ మువ్స్, ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషనల్ కనెక్ట్ అన్నీ పాటకు అదనపు ఆకర్షణగా మారాయి. ఇద్దరూ ఎంత సింపుల్‌గా కనిపించినా.. వారి మధ్య కనిపించే భావోద్వేగాలు ప్రేక్షకులను పూర్తిగా మెప్పిస్తున్నాయి. క్లాస్ టచ్‌తో పాటను తెరకెక్కించడంలో దర్శకుడి మెలకువ స్పష్టంగా కనిపిస్తోంది.
వీడియోలోని క్లోజ్‌అప్ షాట్స్, స్టైలిష్ లుక్, లైట్ కలర్స్ వాడకం, మ్యూజిక్‌కు తగ్గట్టుగా డ్యాన్స్ మువ్స్ ఇవన్నీ పాటను యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునేలా చేశాయి. ‘నధివే’ పాట కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్‌ను సాధించడంతో పాటే, సోషల్ మీడియాలో అభిమానులు సాంగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మ్యూజిక్ లవర్స్ లో విశేష స్పందన రావడం చూస్తే, సినిమా ఆల్బమ్‌కు మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి.
ఇప్పుడే ఫస్ట్ సింగిల్ తోనే ఇంత రెస్పాన్స్ రావడంతో, సినిమా మిగతా పాటలు, ప్రమోషన్స్ మీద కూడా క్రేజ్ పెరిగింది. రష్మిక అందం, పెర్ఫార్మెన్స్, కథలోని లేడీ ఓరియెంటెడ్ టచ్ ఇవన్నీ కలిసొచ్చి ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీపై భారీ అంచనాలు తీసుకొస్తున్నాయి. ఇక ఈ పాటతో కలిసొచ్చిన క్రేజ్ సినిమాకు మరింత లాభం చేయనుంది. ఇక సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.