దిల్ రాజు క్యాంప్ ఓన్ మూవీ ఏమైంది?

ఈ సినిమా దిల్ రాజు, శిరీష్‌కు భారీ న‌ష్టాల‌ని తెచ్చి పెట్టింది. దీని నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాల‌ని ఆలోచిస్తున్న త‌రుణంలో `సంక్రాంతికి వ‌స్తున్నాం` సినిమాతో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి వారిని ఒడ్డున ప‌డేశాడు.;

Update: 2026-02-11 09:30 GMT

టాలీవుడ్‌లో పేరుమోసిన సంస్థ‌ల్లో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు బ్యాన‌ర్‌ ఒక‌టి. `దిల్` నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సూప‌ర్ హిట్‌లు, బ్లాక్ బ‌స్ట‌ర్లు, ఫ్యామిలీ సూప‌ర్ హిట్‌లు వ‌చ్చాయి. అదే స్థాయిలో డిజాస్ట‌ర్ల‌ని కూడా ఎదుర్కొన్నారు. త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో సినిమా తీయాల‌ని `ఇండియ‌న్ 2`లో భాగం కావాల‌నుకున్నారు. కానీ టాలీవుడ్ వ‌ర్గాల్లో అత్య‌ధిక మంది చెప్ప‌డంతో ఆ నిర్ణ‌యాన్ని విర‌మించుకున్నారు. ఆ త‌రువాత కూడా శంక‌ర్‌తో సినిమా చేయాల‌ని బ‌లంగా ఫిక్స్ అయిపోయ‌న దిల్ రాజు, శిరీష్ ఫైన‌ల్‌గా `గేహ్ ఛేంజ‌ర్‌` మూవీని చేయ‌డం అది బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్ అనిపించుకోవ‌డం తెలిసిందే.

ఈ సినిమా దిల్ రాజు, శిరీష్‌కు భారీ న‌ష్టాల‌ని తెచ్చి పెట్టింది. దీని నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాల‌ని ఆలోచిస్తున్న త‌రుణంలో `సంక్రాంతికి వ‌స్తున్నాం` సినిమాతో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి వారిని ఒడ్డున ప‌డేశాడు. ఈ సినిమా గ‌త ఏడాది సంక్రాంత‌కి విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా భారీ లాభాల్ని తెచ్చి పెట్టింది. మ‌ళ్లీ వారిలో స‌రికొత్త జోష్‌ని నింపింది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో `రౌడీ జ‌నార్థ‌న‌`, దేవి శ్రీ‌ప్ర‌సాద్‌తో `ఎల్ల‌మ్మ‌` మూవీల‌ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇవి షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

వీటికి ముందే త‌మ వార‌సుడు ఆశిష్ హీరోగా `దేత్త‌డి` మూవీని ప్ర‌క‌టించారు. ఆదిత్య రావు గంగ‌సాని ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. గ‌త ఏడాది మేలో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప‌క్కా రూటెడ్ స్టోరీతో ఈ సినిమాని తెర‌పైకి తీసుకొస్తున్నార‌ని ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తోనే క్లారిటీ ఇచ్చారు. `గాండ్ ఫ‌టీతో ఫ‌టీ మ‌గ‌ర్ మ‌గ‌ర్ న‌వాబీ నా ఘ‌టీ` అంటూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌పై ఇచ్చిన క్యాప్ష‌న్ సినిమా ఎంత రాగా ఉంటుందో..ఎంత రూటెడ్‌గా ఉంటుందో స్ప‌ష్టం చేసింది.

అయితే ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అయిన నెల‌లు కావ‌స్తున్నా ఇంత వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి సంద‌డి లేదు. అప్ డేట్ లేదు. షూటింగ్ జ‌రుగుతోందా? ..లేదా అనే క్లారిటీ లేక‌పోవ‌డంతో దిల్ రాజ్ క్యాంప్ వార‌సుడి మూవీ `దేత్త‌డి` ప‌రిస్థితి ఏంట‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్‌ల నేప‌థ్యంలో ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది. ఇన్నాళ్లుగా హోల్డ్‌లో పెట్టిన ఈ ప్రాజెక్ట్‌ని దిల్ రాజు మొద‌లు పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. టీజ‌ర్ గ్లింప్స్ షూట్‌తో టీమ్ షూటింగ్ మొద‌లు పెట్టిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

రాకెట్ స్పీడుతో సినిమాని పూర్తి చేసి త్వ‌ర‌లోనే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఈ ఏడాది రిలీజ్ కానున్న తొలి సినిమా ఇదే అవుతుంద‌ని అంటున్నారు. సినిమాలు స‌క్సెస్ సాధిస్తున్న త‌రుణంలో ఆశిష్‌ని ప‌క్కా మాస్ క్యారెక్ట‌ర్లో అందులోనూ ప‌క్కా తెలంగాణ పోర‌డిగా క‌నిపిస్తూ చేస్తున్న `దేత్త‌డి`తో స‌క్సెస్‌ని సాధించ‌డం ఖాయ‌మ‌ని, ఈ సినిమాతో త‌న కెరీర్ స‌రికొత్త మ‌లుపు తిరుగుతుంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News