"మైసా"- రష్మిక వైల్డ్ అవతార్
రష్మిక మందన్నా.. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకెళ్తున్న నేషనల్ క్రష్.;
రష్మిక మందన్నా.. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకెళ్తున్న నేషనల్ క్రష్. 'యానిమల్', 'పుష్ప 2', 'కుబేరా', 'ఛావా' చిత్రాలతో వరుస విజయాల జోరు మీదున్న రష్మిక.. ఇప్పుడు మరో విభిన్న పాత్రతో స్క్రీన్‌పై సంచలనం కలిగించబోతోందనే టాక్. ఆమె నటిస్తున్న కొత్త చిత్రం 'మైసా' పేరుతో అధికారికంగా ప్రకటించబడింది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిలిమ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. హను రాఘవపూడి సహాయకుడిగా పని చేసిన రవీంద్ర, ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ రష్మిక కొత్త యాంగిల్‌ను చూపించి అందరిలో ఆసక్తిని పెంచింది. అలాగే ధనుష్ (తమిళ), విక్కీ కౌశల్ (హిందీ), దుల్కర్ సల్మాన్ (మలయాళం), శివరాజ్ కుమార్ (కన్నడ), దర్శకుడు హను రాఘవపూడి (తెలుగు) లాంటి స్టార్ సెలెబ్రిటీస్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం విశేషం. రష్మికను ఎంతో స్పెషల్‌గా ప్రెజెంట్ చేస్తూ.. సినిమా టైటిల్‌ను "మైసా"గా అనౌన్స్ చేశారు. ఇది 'గోండ్ తెగ' మహిళ పాత్ర ఆధారంగా రూపొందినట్టు స్పష్టమవుతోంది.
తాజా ఫస్ట్ లుక్‌లో రష్మిక గోండ్ తెగ మహిళ అవతారంలో కనిపించింది. చేతిలో ఆయుధంతో, భయానకమైన భావాలతో నిలబడిన రష్మిక లుక్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఆమె లుక్ చూస్తుంటే పాత్రలో పవర్ఫుల్ ఏమోషన్ ఉండనున్నట్లు అర్ధమవుతుంది. ఇప్పటి వరకు చూడని రష్మిక పూర్తిగా కొత్త కోణంగా కనిపించడమే కాకుండా హంటెడ్, వుండెడ్, అన్‌బ్రోకెన్ అనే ట్యాగ్ లైన్ సినిమాకు ఇంటెన్సిటీని చాటుతోంది.
దర్శకుడు రవీంద్ర పుల్లే మాట్లాడుతూ.. “ఈ కథను రెండు సంవత్సరాల పాటు మెరుగుపరచాం. ప్రతీ అంశాన్ని పర్ఫెక్ట్ గా ఉండేలా శ్రమించాం. ఇప్పుడు ప్రపంచానికి ఈ కథను చెప్పేందుకు సిద్ధమవుతున్నాం” అని తెలిపారు. సినిమాలో గోండ్ తెగల జీవితంలో ఎదురయ్యే కష్టాలు, పోరాటాలు నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ కథాంశాన్ని చూపించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇదే సమయంలో నిర్మాతలు అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, సహనిర్మాత సాయి గోపా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యూనిట్ షేర్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. సాంకేతిక బృంద వివరాలు త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు. మొత్తానికి రష్మిక మైసా పోస్టర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.