నిజాయితీపై పెద్ద క్లాసే తీసుకున్న నేష‌న‌ల్ క్ర‌ష్!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా పుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, హిందీ సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది.;

Update: 2025-08-11 10:30 GMT

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా పుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, హిందీ సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. ఆదాయానికి ఆదాయం...పేరు కు పేరు రెండు చోట్ల ఎంతో తెలివిగా బ్యాలెన్స్ చేస్తోంది. సాధార‌ణంగా హిందీలో అవ‌కాశాలు వ‌చ్చాయంటే? న‌టీమ‌ణులు తెలుగు సినిమాలు లైట్ తీసుకుంటారు. కానీ ర‌ష్మిక మాత్రం అలాంటి పొర‌పాటు ఎంత మాత్రం చేయకుండా డ‌బుల్ గేమ్ ఆడుతోంది. ఎక్క‌డ అవ‌కాశం అక్క‌డే అంటూ రెండు భాష‌ల్ని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ ని ముందుకు తీసుకెళ్తోంది.

ట్యాలెంట్ తో పాటు అడిష‌న‌ల్ క్వాలిఫికేష‌న్స్ అన్న‌ది ర‌ష్మిక‌కు క‌లిసొచ్చిన అంశం. ఆన్ స్క్రీన్ పై ఎంతటి ఎన‌ర్జిటిక్ పెర్పార్మెన్స్ ఇస్తుందో? ఆఫ్ ది స్క్రీన్ లోనూ అంతే ఉత్సాహంతో కుర్రాళ్ల హృద‌యాల్లో గిలిగింత‌లు పెడుతుంది. అందుకే ర‌ష్మిక మాట్లాడుతుంటే అంతా క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తుంటారు. తాజాగా ర‌ష్మిక నిజాయితీ...నిబ‌ద్ద‌త గురించి మాట్లాడి మ‌రోసారి సెంట్రాఫ్ ది అట్రాక్ష‌న్ గా నిలిచింది. ఇంట్లో ఒక‌లా ..బ‌య‌ట మ‌రోలా ఉంటానంటూ త‌న‌లో వ్య‌త్యాసాన్ని చెప్పే క్ర‌మంలో నిజాయితీ మ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

వ్య‌క్తిగ‌త‌...వృత్తిగ‌త జీవితానికి చాలా వ్య‌త్యాసం ఉందంది. ఇంట్లో తాను ఉండ‌టాన్ని చూస్తే అంతా షాక్ అవుతార‌ని...తానెంతో ఎమోష‌న‌ల్ ప‌ర్స‌న్ గా పేర్కొంది. కానీ అదే ఎమోష‌న్ బ‌య‌ట మాత్రం ఎట్టి ప‌రిస్థి తుల్లో చూపించ‌నంటోంది. ఎందుకంటే అభిమానులు త‌న‌లో ద‌యాగుణాన్ని బ‌ల‌హీన‌త‌గా అనుకుంటా ర‌ని, లేదంటే కెమెరా ముందు ఇదంతా కావాల‌ని చేస్తోన్న షోగా భావిస్తారంది. ఎంత నిజాయితీగా ఉంటే అంత‌గా వ్య‌తిరేకిస్తార‌ని...ఒకే విధంగా ఉండ‌టం వ‌ల్ల చుట్టూ ఉండే నెగివిటీ కూడా త‌నపై ప్ర‌భావం చూపు తుంద‌ని అభిప్రాయ‌ప‌డింది.

అందుకే సొసైటీ కోసం మ‌రీ అంత నిజాయిగా ఉండాల్సిన ప‌నిలేద‌ని...తానెంత నిజాయిగా ఉన్నామ న్న‌ది మ‌న‌సుకు , ఇంట్లో నిజంగా ప్రేమించే మ‌నుషుల‌కు తెలిస్తే చాలు అంది. మొత్తానికి అమ్మ‌డు మాట‌ల్లో సొసై టీ పై చిన్న పాటి సైటెర్ కూడా వ‌దిలిన‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ర‌ష్మికా మంద‌న్నా తెలుగులో `ది గ‌ర్ల్ ప్రెండ్` అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో `థామా`లోనూ న‌టిస్తోంది. ఈ రెండు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.

Tags:    

Similar News