హారర్ వరల్డ్ లోకి నేషనల్ క్రష్!
నేషనల్ క్రష్ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతుంది. తెలుగు, హిందీ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. స్టార్ హీరోలే టార్గెట్ గా సినిమాలు చేస్తోంది. మరోవైపు లేడీ ఓరియేంటెడ్ నాయికగానూ సత్తా చాటే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లో `ఛావా` సినిమాతో యేసుభాయ్ భోంస్లే పాత్రతో నటిగా తన స్థాయిని పెంచుకుంది. హీరోల సరసన రొమాంటిక్ రోల్సే కాదు అవసరమైతే స్పూ్తి నింపే పాత్రల్లోనూ సత్తా చాటుతుందని యేసుబాయి పాత్రతో రుజువు చేసింది.
ఈ పాత్ర రష్మికకు బాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. అరుదుగా కీలక పాత్రల్లో సైతం మెప్పింస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హారర్ హిట్ ప్రాంచైజీలోనూ భాగమవుతోంది. `కాంచన` సిరీస్ లో భాగంగా లారెన్స్ `కాంచన 4`ని రెడీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన స్వీయా దర్శకత్వంలో తెరకెక్కి స్తోన్న చిత్రమిది. సినిమాలో ఇప్పటికే పూజాహెగ్డే, నోరా పటేహీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఇదే సినిమాలో రష్మికను ఓ ప్రత్యేక పాత్ర కోసం సంప్రదించారుట. లారెన్స్ ఇటీవలే ఆమెను కలిసి పాత్ర గురించి వివరించారు.
రష్మిక కూడా పాజిటివ్ గా స్పందించిదని సమాచారం. ఇదే నిజమైతే `కాంచన 4` రేంజ్ మారిపోతుంది. రష్మిక భాగ మైందంటే? ఆ సినిమాకు పాన్ ఇండియాలో క్రేజ్ మామూలుగా ఉండదు. తెలుగు అభిమా నులను మంచి బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించిన బ్యూటీ రష్మిక. ఈ నేపథ్యంలో `కాంచన 4`ని అక్కడా కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. రష్మిక సక్సెస్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవు తుంది. గతంలో `సీతారామం` చిత్రంలోనూ నేషనల్ క్రష్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా కూడా పాన్ ఇండియాలో పెద్ద విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండానే సంచ లనాలు నమోదు చేసిందా చిత్రం. ఆరకంగా `కాంచన 4`కి ఇదొక పాజిటివ్ సైన్ గా చెప్పొచ్చు. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో `థామా`లో నటిస్తోంది. అలాగే తెలుగులో `ది గర్ల్ ప్రెండ్` లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలపై మంచి అంచనాలున్నాయి. సెప్టెంబర్...అక్టోబర్ లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.