స్వయంభు డబుల్ సర్ ప్రైజ్.. దాచారట!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వరుస ప్రయోగాలతో దూసుకుపోతున్నారు.;
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వరుస ప్రయోగాలతో దూసుకుపోతున్నారు. 'కార్తికేయ 2' తో పాన్ ఇండియా రేంజ్‌లో తన సత్తా చాటిన నిఖిల్, ఇప్పుడు ‘స్వయంభు’ అనే భారీ పీరియడ్ డ్రామాతో రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన ప్రతీ అప్‌డేట్ ఆడియన్స్‌లో పాజిటివ్ గా అంచనాలను పెంచుతూనే ఉంది. ముఖ్యంగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సినిమా టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. రాజుల కాలానికి తీసుకెళ్లే సెట్స్, రాజదండం చుట్టూ తిరిగే కథ, రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇలా టీజర్‌లో ప్రతీ ఫ్రేమ్ హై రేంజ్‌లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే టీజర్ కంటే కూడా ఈ వేదికపై హీరో నిఖిల్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఇప్పుడు సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.
అదేమిటంటే, ఈ సినిమా రెండు భాగాలుగా ఉండబోతుందనే విషయాన్ని నిఖిల్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్ట్‌గా లీక్ చేసేశారు. సంయుక్త మీనన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్న ఫ్లోలో, "రెండు పార్టుల్లోనూ ఆవిడ పాత్ర ఉంటుంది, షీ ఈజ్ డూయింగ్ ఆన్ అమేజింగ్ థింగ్" అని నిఖిల్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ‘స్వయంభూ’ రెండు భాగాలుగా వస్తుందనే దానిపై కొన్ని రూమర్స్ వినిపించినా, మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ నిఖిల్ ఇలా డైరెక్ట్‌గా చెప్పేయడంతో సినిమా స్పాన్ ఎంత పెద్దదో అర్థమవుతోంది.
సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ దాచి ఉంచామని, వాటన్నింటినీ మెల్లిమెల్లిగా బయటకు తీస్తామని నిఖిల్ హింట్ ఇచ్చారు. రాజదండం స్వాధీనం చేసుకునేందుకు జరిగే యుద్ధాల నేపథ్యంలో ఈ మూవీ కథ సాగనుందని టీజర్ ద్వారా క్లారిటీ వచ్చింది. నిఖిల్ ఒక పవర్ ఫుల్ వారియర్‌గా ఈ సినిమాలో సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు. 10 భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను పిక్సెల్ స్టూడియోస్ అత్యంత భారీగా నిర్మిస్తోంది.
హీరోయిన్స్ సంయుక్త మీనన్, నభా నటేష్ పాత్రల విషయంలో కూడా నిఖిల్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. టీజర్‌లో అందరినీ థ్రిల్ చేసిన విజువల్స్ కేవలం శాంపిల్ మాత్రమేనని, సినిమాలో ఇంకా అద్భుతమైన సీక్వెన్స్ లు ఉన్నాయని మేకర్స్ చెబుతున్నారు. రెండు పార్టుల వార్తతో ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై బిజినెస్ పరంగా క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 10న ‘స్వయంభూ’ థియేటర్లలో సందడి చేయబోతోంది. ఒకే ఒక్క టీజర్‌తో సినిమా లెవల్ ఏంటో నిఖిల్ టీమ్ చూపించింది. రాజవంశాల గొడవలు, భారీ సెట్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి నిఖిల్ మేజిక్ చేసేలా ఉన్నారు. నిఖిల్ నోటి నుంచి వచ్చిన ‘టూ పార్ట్స్’ అనే లీక్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి మొదటి భాగం ఏ స్థాయిలో మెప్పిస్తుందో, రెండో భాగం కోసం ఎలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.