కీర్తి - కృతి.. కొత్త చర్చేంటి?

కీర్తి, కృతి ఇద్దరూ తమ కెరీర్‌ స్టార్టింగ్ లో ఎక్కువగా గ్లామర్‌ కు దూరంగానే కనిపించారు. రోల్ కు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

Update: 2026-06-18 10:29 GMT

టాలీవుడ్ లో హీరోయిన్ల కెరీర్‌ లో గ్లామర్‌, యాక్టింగ్ రెండింటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. కొందరు యాక్టింగ్ తో గుర్తింపు తెచ్చుకుంటే, మరికొందరు గ్లామర్‌ తో ఆకట్టుకుంటారు. అయితే జెనరేషన్ కు తగ్గట్లు చాలా మంది హీరోయిన్లు తమ ఇమేజ్‌ ను మార్చుకుంటూ ముందుకు సాగుతుంటారు. ప్రస్తుతం అలాంటి చర్చే హీరోయిన్లు కీర్తి సురేష్‌, కృతి శెట్టి చుట్టూ జరుగుతోంది.

కీర్తి, కృతి ఇద్దరూ తమ కెరీర్‌ స్టార్టింగ్ లో ఎక్కువగా గ్లామర్‌ కు దూరంగానే కనిపించారు. రోల్ కు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. కీర్తి సురేష్‌ అయితే యాక్టింగ్ కు ప్రాధాన్యం ఉన్న రోల్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించారు. మరోవైపు కృతి శెట్టి కూడా తొలి సినిమాలతోనే వరుస విజయాలు అందుకుని సెన్సేషన్‌ గా మారారు.

ఆ తర్వాత మెల్లగా పరిస్థితులు మారాయి. కొత్త హీరోయిన్లతో పోటీ పెరగడం, అవకాశాల కోసం మారుతున్న ట్రెండ్‌ లకు తగ్గట్టు ముందుకు వెళ్లాల్సిన అవసరం రావడంతో ఇద్దరి కెరీర్స్ లోనూ మార్పులు కనిపించాయి. ముఖ్యంగా కీర్తి సురేష్‌ ఇటీవల గ్లామరస్‌ లుక్స్‌ తో సోషల్‌ మీడియాలో, సినీ ఈవెంట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు. బాలీవుడ్‌ లో అడుగుపెట్టిన తర్వాత ఆమె స్టైల్‌ లో వచ్చిన ఛేంజ్ గురించి అభిమానులు కూడా చర్చించుకున్నారు.

కృతి శెట్టి విషయంలోనూ ఇలాంటి పరిణామాలే కనిపించాయి. స్ట్రార్టింగ్ లో ఇన్నోసెంట్ రోల్స్, ట్రెడిషనల్ లుక్స్‌ తో కనిపించిన ఆమె, తర్వాత గ్లామర్‌ కు కూడా ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు ఎంచుకోవడం స్టార్ట్ చేశారు. దీంతో ఇద్దరూ కొత్త ఇమేజ్‌ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి రూపొందిస్తున్న కొత్త సినిమాలో వారిద్దరూ కలిసి నటించడం ఆసక్తికరంగా మారింది.

తాజాగా ప్రారంభమైన ఆ ప్రాజెక్టుపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అనిల్‌ రావిపూడి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ తోపాటు హీరోయిన్ల పాత్రలకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉండటం తెలిసిందే. గతంలో ఆయన తెరకెక్కించిన ఎఫ్‌2 సినిమాలో తమన్నా, మెహ్రీన్‌ పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలో గ్లామర్‌ తో పాటు ఎంటర్టైన్మెంట్ కు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు.

అందుకే ఇప్పుడు కీర్తి, కృతి రోల్స్ కూడా అదే మోడల్ లో ఉంటాయా అనే చర్చ సోషల్‌ మీడియాలో ఇప్పుడు జరుగుతోంది. అయితే రావిపూడి శైలిని పరిశీలిస్తే, ఇద్దరికీ కథలో మంచి ఇంపార్టెన్స్ ఉండే ఛాన్సులు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. మరోవైపు ఆడియన్స్ టేస్ట్ కూడా గతంతో పోలిస్తే మారింది. కేవలం గ్లామర్‌ మాత్రమే కాకుండా, కథలో స్ట్రాంగ్ రోల్స్ ఉంటేనే మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ నేపథ్యంలో కీర్తి, కృతి నటనతో పాటు గ్లామర్‌ ను ఈక్వల్ గా బ్యాలెన్స్ పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కీర్తి, కృతి ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గ్లామర్‌ కు ఇంపార్టెన్స్ ఇస్తారా? లేక యాక్టింగ్ బేస్డ్ రోల్స్ తో ఆకట్టుకుంటారా? అన్నది అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News