రెడ్ డ్రెస్ లో మానస అందాలు.. ఆ పిక్స్ అదుర్స్!
సోషల్ మీడియాను ఈ మధ్య సెలబ్రిటీలు పాపులారిటీ సంపాదించుకోవడానికి ఆయుధంగా మలుచుకుంటున్నారు.;
సోషల్ మీడియాను ఈ మధ్య సెలబ్రిటీలు పాపులారిటీ సంపాదించుకోవడానికి ఆయుధంగా మలుచుకుంటున్నారు. అందులో భాగంగానే అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తమ ట్రెండీ ఫ్యాషన్స్ తో అటు ఫ్యాషన్ ప్రియులను కూడా మెప్పిస్తున్నారు. ముఖ్యంగా తమ డ్రెస్ సెన్స్ తో అమ్మాయిలకు సరికొత్త ఫ్యాషన్ ను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో కాలేజ్ కి వెళ్ళే అమ్మాయిలు కూడా హీరోయిన్స్ డ్రెస్సింగ్ ను ఫాలో అవుతున్నారు అంటే ఇక సెలబ్రిటీలు ఏ రేంజ్ లో యువతను ఆకట్టుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
కాలానుకనుగుణంగా చాలా అందంగా తయారవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మలు.. అటు ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటున్నారు. ఒకవైపు అందాలు ఆరబోస్తూ మరొకవైపు కొన్ని ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ భారీగా ఆదాయాన్ని పెంపొందించుకుంటున్న విషయం తెలిసిందే . ఇదిలా ఉండగా ఇప్పుడు తన అందంతో ఆకట్టుకోవడమే కాకుండా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా ఘాటు మిర్చీలా రెడ్ డ్రెస్ లో ఫోటోలు షేర్ చేసి అందరినీ ఆకట్టుకుంది మానస వారణాసి.
అందం , అభినయంతో అభిమానులను ఆకట్టుకునే ఈ చిన్నది సింపుల్ స్మైల్ తో మనసుకు హత్తుకునేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. విషయంలోకి వెళ్తే.. సంతోష్ శోభన్ హీరోగా మానస వారణాసి హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం కపుల్ ఫ్రెండ్లీ . ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇటీవల మంగళవారం హైదరాబాదులో ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. చిత్ర బృందం. అందులో భాగంగానే తన అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్ తో అందర్నీ ఆకట్టుకున్న ఈమె.. అవే ఫోటోలను ఫోటోషూట్ నిర్వహించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇందులో సింపుల్ స్మైల్ తో ఆకట్టుకుంటూనే మరొకవైపు గార్జియస్ లుక్ లో కనిపించి ఆడియన్స్ హృదయాలను దోచుకుంది.
ఇకపోతే ఈ లుక్ లో ఈమెను చూసిన కొంతమంది అభిమానులు జూనియర్ అనుపమ అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు. మొత్తానికైతే మానస వారణాసి పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోషూట్ విపరీతంగా వైరల్గా మారింది.
ఇకపోతే వాలెంటైన్స్ డే సందర్భంగా తన సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో.. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మానస వారణాసి మాట్లాడుతూ.. ప్రేమపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. మనం మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల మధ్య ఎంత భద్రతగా ఫీల్ అవుతామో ..ప్రేమికుడి వద్ద అంతే భద్రతగా ఉండాలి. అదే అసలైన ప్రేమకు నిర్వచనం అంటూ చెప్పుకొచ్చింది.. మొత్తానికైతే అటు తన నటనతోనే కాదు ఇటు అద్భుతమైన అభిప్రాయాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది మానస వారణాసి.
మానస వారణాసి తెలంగాణకు చెందిన మోడల్.. కోకోకోల మ్యూజిక్ హాల్ 2021 భారతదేశం తరఫున మిస్ వరల్డ్ పోటీలలో ప్రాతినిధ్యం వహించి పదవ స్థానంలో నిలిచింది.