సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పుత్రికోత్సాహం!

నామిన‌ల్ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మూడు రోజుల్లోనే రూ.11 కోట్లు వ‌సూలు చేసి మేక‌ర్స్‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురి చేస్తోంది.;

Update: 2026-02-11 08:36 GMT

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తూ య‌మ బిజీగా ఉన్నారు. నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ష‌న్‌లో మోస్ట్ వాంటెడ్ సీక్వెల్ `జైల‌ర్‌2`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ జూన్ 12న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. సిబి చ‌క్ర‌వ‌ర్తి డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన ర‌జ‌నీ త‌న బెస్ట్ ఫ్రెండ్ క‌మ‌ల్‌తో క‌లిసి భారీ మ‌ల్టీస్టార‌ర్‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్న విష‌యం తెలిసిందే.

నెల్స‌న్ దిలీప్‌కుమార్ దీన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. 80వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ డ్రామాగా దీన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ప్రోమోని ద‌ర్శ‌కుడు షూట్ చేసిన‌ట్టుగా కోలీవుడ్ టాక్‌. ఇదిలా ఉంటే ర‌జ‌నీకాంత్ పుత్రికోత్సాహాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఆయ‌న ముద్దుల కూతురు సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ డైరెక్ష‌న్ ప‌క్క‌న పెట్టి కొత్త ద‌ర్శ‌కుడు మ‌ద‌న్‌కు అవ‌కాశం ఇస్తూ మ‌రో ఇద్ద‌రు భాగ‌స్వాముల‌తో క‌లిసి ఓ క్యూట్ ల‌వ్‌స్టోరీని నిర్మించింది. అదే విత్ ల‌వ్‌`.

`టూరిస్ట్ ఫ్యామిలీ` మూవీతో ద‌ర్శ‌కుడిగా తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సైతం సొంతం చేసుకున్న యంగ్ టాలెంటెడ్ అబిష‌న్ జీవింత్ ఈ మూవీతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. `రేఖా చిత్రం`, ఛాంపియ‌న్ చిత్రాల ఫేమ్ అన‌స్వ‌ర రాజ‌న్ ఇందులో హీరోయిన్‌గా న‌టించింది. త‌మిళంతో పాటు తెలుగులో ఫిబ్ర‌వ‌రి 6న విడుద‌లైన ఈ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని మ‌రీ ముఖ్యంగా యూత్ ఆడియ‌న్స్‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

నామిన‌ల్ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మూడు రోజుల్లోనే రూ.11 కోట్లు వ‌సూలు చేసి మేక‌ర్స్‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురి చేస్తోంది. ఈ నేప‌థ్యంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న కుమార్తె విజ‌యంపై ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఈ మూవీ టీమ్‌ని ప్ర‌త్యేకంగా అభినందించి వారితో ఫోటోలు దిగారు. ఈ ఆనంద‌క్ష‌ణాల‌కు సంబంధించిన ఫొటోల‌ని, వీడియోని సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసింది.

త‌న తండ్రి త‌న మూవీ టీమ్‌ని అభినందించ‌డం త‌న‌కు ద‌క్కిన అమూల్య‌మైన‌ క్ష‌ణాలుగా ఆమె అభివ‌ర్ణించింది. త‌ను షేర్ చేసిన వీడియోకు `ప్రేమ‌తో ఒకే ఒక్క‌డు త‌న అప్పాతో..ఇది కేవ‌లం ఒక స‌మావేశం కాదు. ఇది ఒక భావోద్వేగం` అంటూ సౌంద‌ర్య ఎమోష‌న‌ల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ర‌జ‌నీకాంత్ పుత్రికోత్సాహంతో మురిసిపోతున్న క్ష‌ణాల‌ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.




Tags:    

Similar News