రచ్చ గెలిచి ఇంట ఓడిపోతున్న రష్మిక!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పాన్ ఇండియా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ నుంచి ఈ రేంజ్ ని సక్సెస్ సాధించింది.;
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పాన్ ఇండియా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ నుంచి ఈ రేంజ్ ని సక్సెస్ సాధించింది. ఇప్పుడు పాన్ ఇండియాలో రష్మిక ఓ సంచలనం. స్టార్ హీరోలే ఆమెతో నటించడానికి క్యూలో ఉన్నారు. బాలీవుడ్ సైతం రష్మిక డేట్లు కోసం ఎదురు చూసే సన్నివేశం తలెత్తింది. ఆమె బ్రాండ్ తో వందల కోట్ల వ్యాపారానికి అవకాశం ఉంది. అంత గొప్ప సక్సస్ ని రష్మిక సాధించింది.
కానీ ఏం లాభం రచ్చ గెలిచినా ఇంట మాత్రం ఎప్పటికప్పుడు ఓడిపోతూనే ఉంది. సొంత పరిశ్రమ కన్నడ నుంచి మాత్రం నిత్యం వ్యతిరేకతను ఎదుర్కూంటూనే ఉంది. ఏ ముహూర్తాన కన్నడ నుంచి తెలుగు నాటకు వచ్చిందో? అప్పటి నుంచి రష్మికకు సొంత భాష నుంచి వ్యతిరేకత వ్యకతమవుతోంది. రక్షిత్ శెట్టి తో బ్రేక్ అయిన తర్వాత తప్పంతా రష్మికదే అన్నట్లు అక్కడ మీడియా హైలైట్ చేసింది.
ఆ తర్వాత కన్నడలో వచ్చిన కొన్ని సినిమాలకు నో చెప్పింది. ఓ సందర్బంలో తాను తెలుగు బిడ్డనే అన్న వ్యాఖ్యలు కూడా చేసింది. దీంతో కన్నడ ఇండస్ట్రీ సహా జనాలు రష్మికపై భగ్గుమన్నారు. సొంత పరిశ్రమనే తక్కువ చేస్తావా? అంటూ మండిపడ్డారు. అవన్నీ మర్చిపోయి తాజాగా కన్నడ నాట ఓ ఫిలిం పెస్టివ్ లకు అతిధిగా ఆహ్వానం అందింది రష్మికకు. కానీ రష్మిక ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు.
దీంతో మరోసారి అమ్మడిపై వ్యతిరేకత పవనాలు వీచాయి. ఈ సారి ఏకంగా రాజకీయ నాయకులకే టార్గెట్ అయింది. సొంత రాష్ట్ర అంత లోకువ అయిందా? అంటూ మండిపడ్డారు. కొడవ కమ్యునిటీ నుంచి నువ్వు ఒక్కదానివే హీరోయిన్ అనుకుంటున్నావా? ప్రేమ , శ్వేత చెంగప్ప, నిధి సుబ్బయ్య కూడా హీరోయిన్లు అయ్యారంటూ గుర్తు చేసారు. ఓ సందర్భంలో రష్మిక కొడవ కమ్యునిటీ నుంచి హీరోయిన్ అయింది తా నొక్కరే అని వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలకు తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఇలా రష్మిక రచ్చ గెలిచినా ఇంట ఓడిపోతూనే ఉంది.