విజ‌య్ జీవితంలో ఉంటే అది ఒక వ‌రం: ర‌ష్మిక‌

`గీత గోవిందం` సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక జంట న‌డుమ మ్యాజిక‌ల్ రొమాన్స్ మొద‌లైంది.;

Update: 2025-11-13 04:28 GMT

`గీత గోవిందం` సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక జంట న‌డుమ మ్యాజిక‌ల్ రొమాన్స్ మొద‌లైంది. ఆ త‌ర్వాతా ప‌లు చిత్రాల్లో ఈ జంట రిపీటైంది. ఈ బంధం ఎప్ప‌టికీ చెరిగిపోనిది.. ఇప్పుడు గీత -గోవిందుడు ఒక‌ట‌య్యే సంద‌ర్భం... విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక మంద‌న్న జంట నిజ జీవితంలోను ఓ ఇంటి వాళ్లు కాబోతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ర‌ష్మిక న‌టించిన `ది గ‌ర్ల్ ఫ్రెండ్` ప్ర‌చార వేదికపై ఒక‌రి గురించి ఒక‌రు స్ఫూర్తివంత‌మైన ప్ర‌శంసా పూర్వ‌క‌మైన మాట‌ల‌తో అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకున్నారు. `ది గ‌ర్ల్ ఫ్రెండ్` విజ‌యోత్స‌వ వేడుక‌లో పాల్గొన్న విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక గురించి మాట్లాడారు. వ్య‌క్తిగ‌తంగా, వృత్తిగ‌తంగా ర‌ష్మిక ఎదుగుద‌ల‌ను అత‌డు కీర్తించాడు.

సంవ‌త్స‌రాలుగా త‌న ఎదుగుద‌ల‌ను చూస్తున్నాను. నేను వ్య‌క్తిగ‌తంగా దూకుడుగా ఉంటే, ర‌ష్మిక జాలి ద‌య‌తో ఉంటుంది. ప్రపంచం ఒక రోజు ఆమె నిజంగా ఎవరో చూస్తుంది... ది గర్ల్‌ఫ్రెండ్ కేవలం సినిమా కాదు.. ఒక ఉద్దేశ్యం... ప‌దిమందికి బలాన్నిచ్చే సినిమాతో రాష్ వ‌చ్చినందుకు గ‌ర్విస్తున్నాను! అని అన్నారు.

ఇక ఇదే వేదిక‌పై విజ‌య్ గురించి ర‌ష్మిక‌ మాట్లాడుతూ.. ''అత‌డు జీవితంలో ఉండ‌టం ఒక వ‌రం'' అని అన్నారు. ఇది ఎవ‌రికైనా వ‌ర్తిస్తుంద‌ని కూడా ర‌ష్మిక వ్యాఖ్యానించారు. విజ‌య్ తొలి నుంచి ఈ సినిమాలో భాగం. విజ‌యోత్స‌వ వేడుక‌లోను భాగ‌మ‌య్యాడు. ఈ ప్ర‌యాణంలో అత‌డు భాగం. ప్ర‌తి ఒక్క‌రి జీవిత‌ ప్ర‌యాణాల్లో అత‌డు భాగంగా ఉంటే అది ఒక వ‌రం అని అన్నారు.

విజ‌య్- ర‌ష్మిక జంట‌గా గీత గోవిందం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. ఆ త‌ర్వాత డియ‌ర్ కామ్రేడ్, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లోను జంట‌గా న‌టించారు. ఈ రెండు సినిమాలు ఆశించిన విజ‌యాల‌ను అందుకోలేదు. కానీ ఈ జంట మ‌రోసారి వెండితెర‌పై రిపీట్ కానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక జంట‌గా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించ‌నున్న‌ పీరియాడికల్ డ్రామా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన‌ ప‌నులు సాగుతున్నాయి.

పెళ్లి భాజా తేదీ

విజయ్ దేవరకొండ- ర‌ష్మిక మంద‌న్న జంట‌ గత నెలలో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఫిబ్రవరి 2026లో వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు క‌థ‌నాలొస్తున్నాయి. తాజా గుస‌గుస‌ల‌ ప్రకారం, రష్మిక - విజయ్ వివాహం 26 ఫిబ్రవరి 2026న రాజస్థాన్‌-ఉదయపూర్‌లోని ఒక విలాసవంతమైన ప్యాలెస్‌లో జరుగుతుంది. ఈ జంట ఇంకా అధికారికంగా ఈ వార్తను ధృవీకరించాల్సి ఉంది.





Tags:    

Similar News