ప్ర‌ముఖ యాంక‌ర్ ర‌ష్మికి శ‌స్త్ర చికిత్స‌

యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్ అందుకు మిన‌హాయింపు కాదు. త‌న‌దైన అందం ప్ర‌తిభ‌తో ద‌శాబ్ధాలుగా బుల్లితెర‌ను ఏల్తున్న ఈ `జ‌బ‌ర్ధస్త్` యాంక‌ర్ కం న‌టి తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యాన‌ని తెలిపారు.;

Update: 2025-04-21 04:56 GMT

రంగుల ప్ర‌పంచంలో ఒత్తిళ్ల మ‌య జీవితం గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది త‌క్కువ‌. అయితే అన్ని ఒత్తిళ్ల‌ను త‌ట్టుకుని త‌మ ప‌ని తాము చేసుకుపోతుంటారు సెల‌బ్రిటీలు. యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్ అందుకు మిన‌హాయింపు కాదు. త‌న‌దైన అందం ప్ర‌తిభ‌తో ద‌శాబ్ధాలుగా బుల్లితెర‌ను ఏల్తున్న ఈ `జ‌బ‌ర్ధస్త్` యాంక‌ర్ కం న‌టి తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యాన‌ని తెలిపారు. ఆస్ప‌త్రిలో శ‌స్త్ర చికిత్స అనంత‌రం తన ఆరోగ్య ప‌రిస్థితి గురించి సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు.


ఆస్ప‌త్రిలో ఆప‌రేషన్ త‌ర్వాత త‌న స్థితికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ని ర‌ష్మి గౌత‌మ్ షేర్ చేసారు. దీంతో పాటు త‌న అనారోగ్య ప‌రిస్థితి గురించి ర‌ష్మి సుదీర్ఘ నోట్ లో వివ‌రాలు అందించారు. ర‌ష్మి త‌న ఇన్ స్టాలో ఇలా రాసారు. నా హిమోగ్లోబిన్ 5 రోజుల్లో 9 కి పడిపోయినప్పుడు ఈ అత్యవసర పరిస్థితి త‌లెత్తింది. న‌న్ను య‌థాస్థితికి తెచ్చేందుకు అన్నీ వదులుకుని నాకు సహాయం చేసినందుకు నా స‌న్నిహితులు, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. జనవరి నుండి నాకు భుజం నొప్పితో పాటు, అకాల రక్తస్రావం అవుతోంది. ఏ సమస్యను మొదట పరిష్కరించాలో నాకు నిజంగా అర్థం కాలేదు. మార్చి 29 నుండి శరీరం విశ్రాంతి తీసుకుంది. చివరికి నా ప్రస్తుత కమిట్‌మెంట్‌లను పూర్తి చేసిన తర్వాత ఏప్రిల్ 18 న నాకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. నేను తిరిగి పని ప్రారంభించే వరకు తదుపరి మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటున్నాను`` అని తెలిపారు.

ఈ ఫోటోలు ఆప‌రేష‌న్ థియేట‌ర్‌కి వెళ్లే ముందు ఫోటోలు.. ఇతర ఫోటోలు భయానకంగా ఉన్నాయ‌ని ర‌ష్మి తెలిపారు. ఫై ఫైబ్రాయిడ్లు (క‌డుపు నొప్పి, హెవీ పీరియ‌డ్స్) సమస్యతో బాధ‌ప‌డుతున్నాను.. వాటిని విజయవంతంగా వైద్యులు తొలగించార‌ని కూడా యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్ వెల్ల‌డించారు.

Tags:    

Similar News