• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అస‌లు దీపిక ర‌ణ‌వీర్‌కి...

అస‌లు దీపిక ర‌ణ‌వీర్‌కి ప‌డ‌లేద‌న్న రామ్‌లీల కోస్టార్

| రణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకొణె 2018లో వివాహం చేసుకున్నారు. కానీ 2015 లో వారికి నిశ్చితార్థం జరిగింది.

By - Tupaki Desk
Update: 2023-11-11 14:30 GMT

రణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకొణె 2018లో వివాహం చేసుకున్నారు. కానీ 2015 లో వారికి నిశ్చితార్థం జరిగింది. రణవీర్ సింగ్ `కాఫీ విత్ కరణ్ 8` ఎపిసోడ్‌లో ఈ ర‌హ‌స్యాల‌న్నిటినీ ఆ జంట స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టారు. ఇటలీలో పెళ్లికి ప్రయత్నించే ముందు ఇద్దరూ కొంతకాలం డేటింగ్ చేశారు. ఎపిసోడ్‌లో దీప్‌వీర్ గురించిన కొన్ని ర‌హ‌స్యాల గురించి తెలియ‌గానే అభిమానులు షాక్ కి గుర‌య్యారు. ఇప్పుడు `రామ్ లీలా`లో దీపిక - రణవీర్‌లతో కలిసి పనిచేసిన న‌టుడు గుల్షన్ దేవయ్య ఆ ఇద్దరు తారల మధ్య సెట్స్‌లో ఏమి జరిగిందో వెల్ల‌డించారు.

దీపిక - రణ్‌వీర్‌ల మధ్య మొదట్లో ఎలాంటి స్పార్క్ కనిపించలేదని గుల్షన్ దేవయ్య తాజా ఇంట‌ర్వ్యూలో అన్నారు. రణవీర్ సింగ్ అంటే దీపికా పదుకొణెకు చాలా ఇష్టం అని అతను ఊహించాడు. కానీ అది నిజం కాదు. 25 రోజుల పాటు సాగిన ముంబై షెడ్యూల్‌లో ఇదంతా జరిగింది. ఆ తర్వాత, వారు ఉదయపూర్‌లో షూటింగ్ ప్రారంభించినప్పుడు దేవ‌య్య‌ ఆశ్చర్యపోయే విష‌యం ఒక‌టి జ‌రిగింది. అక్క‌డ అక‌స్మాత్తుగా ఆ ఇద్ద‌రినీ ల‌వ్ బ‌ర్డ్స్ గా చూసాడు. అయితే ఈ డేటింగ్ చాలా కాలం క్రిత‌మే ప్రారంభించి ఉండవచ్చని ఫ‌జిల్ అప్ప‌టికి వీడింద‌ట‌. రణవీర్ సింగ్ దీపికపై చాలా సీరియస్‌గా ఉన్నాడని త‌న‌కు తెలిసిన‌ట్టు గుల్షన్ వెల్ల‌డించాడు. అయితే అత‌డికి దీపిక అంత తేలిగ్గా ప‌డిపోలేదని గుల్షన్ చెప్పాడు. ఆ స‌మ‌యంలో రణవీర్‌పై అత‌డు జాలిపడ్డాడు. అయితే ఓవ‌ర్ నైట్ లోనే ఇంత‌ వేగంగా ఎలా సీన్ మారిందో..అని సందేహం వ్య‌క్తం చేసాడు. ఆ త‌ర్వాత క‌థేమిటో తెలిసిందే. ర‌ణ‌వీర్ - దీపిక జంట‌కు పెళ్లయి ఇప్పటికి దాదాపు 5 సంవత్సరాలు అవుతోంది.

దీపికా పదుకొణె, రణ్‌వీర్‌సింగ్‌ చాలా కాలంగా ప్రేమ‌లో ఉన్నారు. కలిసి ఉన్నారు. వారు అభిమానుల‌కు జంట లక్ష్యాలను కూడా నిర్దేశించారు. వారి ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లు, సోషల్ మీడియా పోస్టుల్లోవారు ఒకరినొకరు ఉత్సాహపరిచే విధానం, ఒకరికొకరు మద్దతు ఇచ్చే విధానం ఫ్యాన్స్ కు తెలుసు. ఇటీవల కాఫీ విత్ కరణ్ 8 లో కనిపించినప్పుడు రణవీర్ సింగ్ తనకు ప్రపోజ్ చేయడానికి ముందు తాను బహిరంగంగా వేరొక హీరోతో సంబంధంలో ఉన్నానని దీపిక‌ వెల్లడించింది. వేరొక వ్య‌క్తితో ప్రేమ‌లో ఉన్నప్పుడు కూడా తన మనసులో ఎప్పుడూ రణ్‌వీర్‌ ఉండేవాడని దీపిక తెలిపింది. ఆ ప్రకటన వైరల్‌గా మారడంతో దీపిక ట్రోలింగుకు గురైంది. కానీ దీపిక‌-ర‌ణ‌వీర్ ఇద్దరూ తమ గతాన్ని గతంలో ఉంచారు. ప్రస్తుతం ఆరోగ్యకరమైన స్పేస్ ని ఆస్వాధిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే...దీపికా పదుకొణె త‌దుప‌రి హృతిక్ రోషన్ -అనిల్ కపూర్‌లతో ఫైటర్ చిత్రంలో న‌టిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సింఘం ఎగైన్ లోను దీపిక న‌టిస్తోంది. ఇందులో రణ్‌వీర్ సింగ్ సింబాగా అతిథి పాత్ర‌లో న‌టించారు.


Tags:    
  • Deepikapadukone 
  • Ranveersingh 
  • Fighter 
  • Ranabirkapoor 
  • Anand 
  • Deavayya 
  • Singam 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS