అసహకారం నుంచి సహకారానికి.. రణ్‌వీర్‌కు లభించిన పెద్ద విజయం!

ఈ నిర్ణయంతో రణ్‌వీర్ సింగ్‌కు సంబంధించిన చిత్రాల నిర్మాణ పనులకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయినట్లయింది. సినీ కార్మికుల హక్కుల కోసం పోరాడే అత్యున్నత సంస్థ అయిన ఎఫ్ డ‌బ్ల్యూ ఐసీఈ ఈ నిర్ణయం తీసుకోవడం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2026-06-04 06:15 GMT

పరిశ్రమలో కార్మిక సంఘాలు- నటీనటుల మధ్య సమన్వయం ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో, బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌వీర్ సింగ్‌పై పశ్చిమ భారత చలనచిత్ర ఉద్యోగుల సమాఖ్య (FWICE) విధించిన `అసహకార ఉత్తర్వులను` అధికారికంగా ఉపసంహరించుకోవడం పరిశ్రమలో పెద్ద ఊరటనిచ్చింది. ఈ నిర్ణయంతో రణ్‌వీర్ సింగ్‌కు సంబంధించిన చిత్రాల నిర్మాణ పనులకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయినట్లయింది. సినీ కార్మికుల హక్కుల కోసం పోరాడే అత్యున్నత సంస్థ అయిన ఎఫ్ డ‌బ్ల్యూ ఐసీఈ ఈ నిర్ణయం తీసుకోవడం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా చిత్ర పరిశ్రమలో నిర్మాతలు లేదా నటీనటులు కార్మిక నియమాలను ఉల్లంఘించినప్పుడు లేదా వేతనాల పరంగా ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు ఎఫ్ డ‌బ్ల్యూ ఐసీఈ ఇలాంటి అసహకార ఉత్తర్వులను జారీ చేస్తుంది. ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్నంత కాలం ఫెడరేషన్‌కు చెందిన ఏ సినీ కార్మికుడు, సాంకేతిక నిపుణుడు సదరు నటుడితో లేదా ప్రాజెక్ట్‌తో కలిసి పనిచేయడానికి వీలుండదు. ఇది ఒక రకంగా పరిశ్రమలో సదరు వ్యక్తిపై విధించే తాత్కాలిక బహిష్కరణ లాంటిదే కావడం వల్ల దీని ప్రభావం షూటింగ్ షెడ్యూల్స్‌పై తీవ్రంగా పడుతుంది.

రణ్‌వీర్ సింగ్ ఉదంతంలో గత కొంతకాలంగా నడుస్తున్న వివాదానికి ఇరు వర్గాల మధ్య జరిగిన చర్చల అనంతరం ఎట్టకేలకు తెరపడింది. తలెత్తిన వివాదాల‌ను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి నటుడి ప్రతినిధులు, ఫెడరేషన్ నిర్వాహకులు చొరవ చూపారు. ఇరు పక్షాల మధ్య కుదిరిన అవగాహన - నిబంధనల అమలుపై లభించిన స్పష్టత కారణంగానే ఎఫ్ డ‌బ్ల్యూ ఐసీఈ కఠిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ సయోధ్య పరిశ్రమలో సమిష్టి నిర్ణయాల ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేస్తుంది.

ఈ నిర్ణయం రణ్‌వీర్ సింగ్ కెరీర్‌కు ఎంతో కీలకమైన సమయంలో వచ్చిందనొచ్చు. అసహకార ఉత్తర్వులు రద్దు కావడంతో అప్ క‌మింగ్ చిత్రాల షూటింగ్‌లు ఎలాంటి అంతరాయం లేకుండా వేగంగా పూర్తి కావడానికి మార్గం సుగమమైంది. చిత్ర పరిశ్రమలో ఎంతటి అగ్ర నటుడైనా లేదా పెద్ద నిర్మాణ సంస్థ అయినా వ్యవస్థాగత నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిందేనని ఈ పరిణామం మ‌రోసారి స్పష్టం చేస్తోంది. ఇలాంటి చట్టబద్ధమైన- నైతికపరమైన నియంత్రణలు పరిశ్రమలో క్రమశిక్షణను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

సినీ రంగంలో వచ్చే అంతర్గత విభేదాలు ఎంత త్వరగా సర్దుమణిగితే పరిశ్రమకు అంత మంచిది. వివాదాలు సుదీర్ఘ కాలం కొనసాగితే అది కేవలం నటులకే కాకుండా వారిపై ఆధారపడి జీవించే వందలాది మంది కార్మిక కుటుంబాల ఉపాధిని కూడా దెబ్బతీస్తుంది. ఎఫ్ డ‌బ్ల్యూ ఐసీఈ - రణ్‌వీర్ సింగ్ మధ్య వివాదం ముగియడం అనేది బాలీవుడ్‌లో సానుకూల వాతావరణాన్ని పెంపొందించడమే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి దోహదపడుతుంది.

Tags:    

Similar News