‘ధురంధర్ 2’ 1000 కోట్లు.. టాప్ లిస్టులో ఎక్కడుందంటే?
భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన దర్శకుడు ఆదిత్య ధర్, రణవీర్ సింగ్‌తో కలిసి చేసిన ‘ధురంధర్: ది రివెంజ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది.;
భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన దర్శకుడు ఆదిత్య ధర్, రణవీర్ సింగ్‌తో కలిసి చేసిన ‘ధురంధర్: ది రివెంజ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే థియేటర్ల వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. కేవలం యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కాకుండా, కథలో ఉన్న గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను అడుగడుగునా థ్రిల్ చేస్తున్నాయి.
బాలీవుడ్ నుంచి ఒక పక్కా కమర్షియల్ బొమ్మ పడితే వసూళ్లు ఏ రేంజ్‌లో ఉంటాయో ఈ సినిమా నిరూపిస్తోంది. రణవీర్ సింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ వంటి స్టార్స్ నటన ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచాయి. కేవలం నార్త్ బెల్ట్‌లోనే కాకుండా సౌత్‌లో కూడా ఈ స్పై థ్రిల్లర్ కి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్ హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండటంతో, ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ వద్ద కూడా ‘ధురంధర్ 2’ ట్రెండ్ సెట్ చేస్తోంది.
ఈ జోరు చూస్తుంటే ఇండియన్ సినిమా రికార్డుల లెక్కలు మళ్ళీ తిరగరాయాల్సి వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలు విషయానికొస్తే, ఈ చిత్రం కేవలం ఏడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 1,000 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ కూడా ఇదే వేగంతో ఈ మార్కును అందుకుంది. ఇప్పుడు రణవీర్ సింగ్ కూడా ఆ రికార్డును సమం చేశాడు.
ఇండియాలో నెట్ కలెక్షన్స్ పరంగా చూస్తే వారం రోజుల్లోనే రూ. 623.42 కోట్లు వసూలు చేయడం బాలీవుడ్ చరిత్రలోనే ఒక రికార్డ్. బాహుబలి, పుష్ప తర్వాత రూ. 2,000 కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తున్న ఏకైక బాలీవుడ్ ఫ్రాంచైజీగా ‘ధురంధర్’ నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా టార్గెట్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’. కల్కి సాధించిన రూ. 1,042 కోట్ల లైఫ్ టైమ్ వసూళ్లను ధురంధర్ 2 మరికొన్ని గంటల్లోనే అధిగమించేలా ఉంది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ ‘జవాన్’ (రూ. 1,160 కోట్లు) రికార్డుపై కన్నేసింది.
డొమెస్టిక్ మార్కెట్‌లో కేవలం హిందీ వెర్షన్‌తోనే పుష్ప 2 రికార్డులను కూడా ఇది దాటేయడం గమనార్హం. కేవలం వారం రోజుల్లోనే హిందీలో రూ. 744 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, రెండో వీకెండ్ ముగిసేలోపు ఇండియాలోనే రూ. 1,000 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసే అవకాశం ఉంది.
ఈ వసూళ్ల హడావిడి చూస్తుంటే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టాప్ 10 లిస్టులో పెను మార్పులు జరగబోతున్నాయి. యానిమల్, బజరంగీ భాయ్‌జాన్ వంటి సినిమాలను ఇప్పటికే వెనక్కి నెట్టేసిన ధురంధర్ 2, ఇప్పుడు టాప్ 5 వైపు దూసుకుపోతోంది. ఆదిత్య ధర్ రాసుకున్న స్క్రిప్ట్, రణవీర్ సింగ్ మాస్ అప్పీల్ పక్కాగా వర్కవుట్ అవ్వడమే ఈ భారీ విజయానికి కారణం. బాలీవుడ్ మళ్ళీ ఫామ్ లోకి రావడమే కాకుండా, సౌత్ సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.
ప్రపంచవ్యాప్తంగా వేగంగా రూ. 1,000 కోట్లు సాధించిన ఇండియన్ సినిమాలు
పుష్ప 2: ది రూల్ - 6 రోజులు
ధురంధర్ 2 - 7 రోజులు
బాహుబలి 2 - 10 రోజులు
RRR - 16 రోజులు
KGF చాప్టర్ 2 - 18 రోజులు
జవాన్ - 18 రోజులు
పఠాన్ - 27 రోజులు
కల్కి 2898 AD - 30 రోజులకు పైగా