రణవీర్ సినిమా సెట్ లో 120 మందికి అస్వస్థత.. హాస్పిటల్ కి తరలింపు.. వైద్యులు ఏమన్నారంటే?

సినిమా షూటింగ్ సెట్లో అనుకోని ప్రమాదాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. సినిమా షూటింగ్లో జరిగే తప్పిదాల వల్ల ఏకంగా ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు.;

Update: 2025-08-19 05:40 GMT

సినిమా షూటింగ్ సెట్లో అనుకోని ప్రమాదాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. సినిమా షూటింగ్లో జరిగే తప్పిదాల వల్ల ఏకంగా ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆహుతి ప్రసాద్ లాంటి వ్యక్తులైతే ఏకంగా సగ జీవితాన్నే కోల్పోయారని చెప్పవచ్చు. ఇలా షూటింగ్ సెట్లో జరిగే విషాదాల కారణంగా అటు నటీనటులు, ఇటు కార్మికుల జీవితాలలో విషాదాలు నింపుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు రణవీర్ సింగ్ సినిమా షూటింగ్ సెట్లో ఏకంగా 120 మందికి పైగా కార్మికులు అస్వస్థతకు గురవడంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ధురంధర్ సినిమా షూటింగ్ సెట్లో కార్మికులకు అస్వస్థత..

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్.. ప్రముఖ డైరెక్టర్ ఆదిత్యా ధార్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం ధురంధర్. ఈ సినిమాతో ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవలే రణవీర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది జూలై 6వ తేదీన సినిమా నుండి ఫస్ట్ టీజర్ ను విడుదల చేస్తూ టీజర్ పై అంచనాలు పెంచేశారు. గ్యాంగ్ స్టర్ గా రణవీర్ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లద్దాక్ లోని లేహ్ జిల్లాలో జరుగుతోంది.

120 మందికి అస్వస్థత.. హాస్పిటల్ కి తరలింపు..

ఆదివారం రాత్రి 600 మంది కార్మికులు భోజనం చేయగా అందులో తిన్న వెంటనే 120 మంది అస్వస్థతకు గురయ్యారు అందులో కొంతమందికి విరోచనాలు మరికొంతమందికి వాంతులు కాగా ఇంకొంతమంది కడుపునొప్పితో బాధపడ్డారు వెంటనే వారందరినీ దగ్గర్లో ఉన్న సజల్ నర్బు మెమోరియల్ (SNM) హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నట్లు సమాచారం.

వైద్యులు తెలిపిన వివరాల మేరకు..

వీరందరికీ చికిత్స అందించిన వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమందికి తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటీస్ , తలనొప్పి, కడుపునొప్పి, వాంతులు కూడా అయ్యాయి అయితే ఇదంతా ఫుడ్ పాయిజనింగ్ వల్ల అయ్యింది. భయపడాల్సిన అవసరం లేదు అని వైద్యులు తెలపడంతో చిత్ర బృందం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికైతే ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఇలా దాదాపు 120 మంది కార్మికులు అస్వస్థతకు గురవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ధురంధర్ సినిమా విశేషాలు..

ధురంధర్ సినిమా విషయానికి వస్తే.. 1970 - 80 మధ్యకాలంలో భారత నిఘా సంస్థ (RAW) నిర్వహించిన నిజమైన రహస్య కార్యకలాపాల నుండి ప్రేరణ పొంది.. ఇప్పుడు తెరపైకి రాబోతోంది అని చిత్ర బృందం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సినిమాలో రణవీర్ సింగ్ తో పాటు ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల టీజర్ విడుదలవ్వగా టీజర్ తోనే అంచనాలు పెంచేశారు. అయితే ఇప్పుడు సినిమా షూటింగ్ సెట్ లో జరిగిన ఈ ఘటనతో చిత్ర బృందం మళ్ళీ వార్తల్లో నిలిచారు.

Tags:    

Similar News