250 కోట్ల విలువైన‌ బంగ్లాలోకి షిఫ్ట‌వుతున్న స్టార్ క‌పుల్

ఈ జంట ఈ సంవత్సరం దీపావళిని వారి కొత్త ఇంటిలో సెల‌బ్రేట్ చేసుకునే అవకాశం ఉందని హిందూస్తాన్ టైమ్స్ ప్రత్యేకంగా నివేదించింది.

Update: 2024-05-22 14:53 GMT

అలియా భట్ - రణబీర్ కపూర్ తమ కుమార్తె రాహాతో కలిసి తమ కొత్త బంగ్లాకు షిఫ్ట‌య్యేందుకు సిద్ధంగా ఉన్నారు. చాలా కాలంగా ఈ అరుదైన క్ష‌ణం కోసం ఉత్కంఠ‌గా వేచి చూస్తున్న ఈ జంట‌కు ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. ఈ భారీ సౌధం నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. ఈ జంట ఈ సంవత్సరం దీపావళిని వారి కొత్త ఇంటిలో సెల‌బ్రేట్ చేసుకునే అవకాశం ఉందని హిందూస్తాన్ టైమ్స్ ప్రత్యేకంగా నివేదించింది. ఎప్ప‌టికి పూర్తవుతుంది? అంటూ చాలా కాలంగా ఎదురుచూస్తూ నిర్మాణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది ఈ జంట‌.

రెండు మూడు నెలల్లో అలియా, రణ్‌బీర్‌తో పాటు రాహా తమ కొత్త బంగ్లాలోకి మారబోతున్నారని ఒక అంత‌ర్గ‌త సోర్స్ రివీల్ చేసింద‌ని హిందూస్తాన్ టైమ్స్ ఉటంకించింది. బంగ్లా తుదిమెరుగుల‌కు సంబంధించిన పని దాదాపు పూర్తయింది. ఇత‌ర ప‌నుల‌కు ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. పని పూర్తయి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత దంపతులు అక్కడికి చేరుకుంటారు. వారు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరుదైన‌ క్షణం ఇది అని సోర్స్ వెల్ల‌డించింది.

Read more!

ఈ బంగ్లా క‌పూర్ కుటుంబానికి భావోద్వేగ ప్రాముఖ్యతను ఆపాదిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ నిర్మాణం ప‌నుల్లో నిమగ్నమై ఉన్నారు. రణబీర్ , అలియా తమ బిజీ షెడ్యూల్ నుండి సమయాన్ని వెచ్చించి భ‌వంతి నిర్మాణ‌ పని స్థితిని తనిఖీ చేసారు అని అంతర్గత వ్యక్తి చెప్పారు. ఈ బంగ్లా స్థ‌లం నిజానికి రణబీర్ తాతలు, రాజ్ కపూర్ , కృష్ణ రాజ్‌లకు చెందినది.. దివంగత రిషి కపూర్ -నీతూ 1980లో ఆస్తిని వారసత్వంగా పొందారు. ఇప్పుడు ర‌ణ‌బీర్ - ఆలియా చేతికి చిక్కుతోంది. క‌పూర్ కుటుంబ వార‌స‌త్వ ఆస్తి కావ‌డంతో సెంటిమెంటు ముడిప‌డి ఉంది.

షారూఖ్‌, అమితాబ్ కంటే ఖ‌రీదు:

ఈ కొత్త బంగ్లాకు రణబీర్ అత‌డి కుటుంబ సభ్యులకు రూ.250 కోట్లు ఖర్చయింద‌ని స‌మాచారం. షారుఖ్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సాలను అధిగమించి ముంబైలోని అత్యంత ఖరీదైన సెలబ్రిటీ బంగ్లా అని ఇటీవ‌ల మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ర‌ణ్‌బీర్ -అలియా ఇద్దరూ కష్టపడి సంపాదించిన డబ్బును తమ కలల ఇంటిని నిర్మించడానికి సమానంగా పెట్టుబడి పెడుతున్నారు. అన్నీ పూర్తయేప్ప‌టికి ఇల్లు కోసం రూ.250 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని స‌మాచార‌. షారూఖ్ ఖాన్ - మన్నత్, అమితాబ్ బచ్చన్ -జల్సాతో పోలిస్తే ఇది ముంబై ప్రాంతంలో అత్యంత ఖరీదైన బంగ్లా అవుతుంది. ఈ బంగ్లాను త‌మ కుమార్తె రాహాకు గిఫ్ట్ గా ఇస్తున్నామ‌ని ఇంత‌కుముందే ర‌ణ‌బీర్ - ఆలియా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ విధంగా బేబి రాహా ముంబై ప‌రిశ్ర‌మ‌లోనే రిచెస్ట్ సెల‌బ్రిటీ కిడ్ గా మారింది.

4

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఆలియా భట్ తన తదుపరి చిత్రం జిగ్రా షూటింగ్‌ను పూర్తి చేసింది. జనవరిలో సంజయ్ లీలా భన్సాలీ తదుపరి చిత్రం `లవ్ అండ్ వార్‌`ను అలియా భట్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో ప్రకటించి అభిమానులందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రం 17 సంవత్సరాల తర్వాత భన్సాలీ - కపూర్‌లను తిరిగి కలుపుతోంది. గంగూబాయి కతియావాడి విజయం తర్వాత ఆలియా భట్‌తో భన్సాలీ మళ్లీ కలిసి ప‌ని చేస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ 2025న విడుదల కానుంది.

Tags:    

Similar News