రణ్ బీర్, సాయి పల్లవి.. గొడవలు రాకుండా ముందుజాగ్రత్త?

స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న 'రామాయణ్' సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.;

Update: 2025-07-11 22:30 GMT
స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న 'రామాయణ్' సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో రణ్బీర్ కపూర్ రాముడి పాత్రలో,  సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. అయితే లీడ్ రోల్స్ ఆనౌన్స్ చేసినప్పటి నుంచి రణ్ బీర్, సాయి పల్లవి సినిమా గురించి మీడియా ముందు ఓపెన్ గా మాట్లాడడం లేదు. 
అయితే రామాయణ్ ప్రాజెక్ట్ ను మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మంకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. రామాయణం అనేది చాలా సెన్సిటీవ్ టాపిక్. రాముడు కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం. మతపరమైన ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి కాంట్రవర్సీలకు తావు ఇవ్వకుండా చూసుకోవాలనేది మేకర్స్ ఆలోచన.
అందుకే ఈ సినిమాలో నటించనున్న లేదా ప్రాజెక్ట్ తో సంబంధం ఉన్న ఎవరైనా వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానో, పొరపాటునగానో ఏదైనా తప్పుగా మాట్లాడితే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది సినిమాను బాయ్ కట్ కు సైతం దారి తీస్తుంది. లేదా వాళ్లు చెప్పే మాటలకను కొందరు తప్పుగా అర్ధం చేసుకోవచ్చు.
ఈ సినిమా కథాంశం చాలా సున్నితమైనది. కాబట్టి, తారాగణం చేసే చిన్న వ్యాఖ్యలను సైతం భుతద్దం పెట్టి పరిశీంచే వాళ్లుంటారు. ఇలాంటి వాటితో ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది అందుకే ఇలాంటి  వివాదాలకు దూరంగా ఉండాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే లీడ్ రోల్స్ లో నటిస్తున రణ్ బీర్, సాయి పల్లవిని రామాయణ్ ప్రాజెక్ట్ గురించి బయట, ఇంటర్వ్యూల్లో, మీడియా ఎదుట ఇలా ఎక్కడా కూడా బహిరంగంగా మాట్లాడవద్దని మేకర్స్ సూచించినట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరూ గతంలో పలు వివాదాల్లో చిక్కుకోవడమే ఇందుక ప్రధాన కారణంగా తెలుస్తోంది.
గతంలో సాయి పల్లవి కొన్ని కాంట్రవర్సీల్లో చిక్కుకున్నారు. ఆమె నటించిన సినిమా ప్రమోషన్స్ లో అనుకోకుండా అన్న కొన్ని మాటలు కొందరిని బాధించాయి. ఆమె హీరోయిన్ గా నటించిన అమరాన్ సినిమా గతేడాది విడుదలై భారీ విజయం దక్కించుకుంది. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో బాయ్ కట్ సాయి పల్లవి ట్రెండ్ నడిచింది. ఎందుకంటే ఆమె అంతకుముందు నటించిన విరాట పర్వం సినిమా ప్రమోషన్స్లో ఆర్మీ గురించి చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీశాయి.
ఆ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ భారత్ ఆర్మీకి పాకిస్థాన్ లో ఉన్న వాళ్లు టెర్రరిస్టులుగా కనిపించవచ్చు. అదేవిధంగా వాళ్లకు మన వాళ్లు కూడా అలానే కనిపిస్తారు కాదా'  అని అన్నారు. అయితే ఈ మాటలు అమరాన్ సినిమా రిలీజ్ టైమ్ లో వైరల్ చేశారు. దీంతో సాయి పల్లవి బాయ్ కట్ అంటూ ట్రెండ్ చేశారు. అలా ఒక సినిమా ప్రమోషన్స్ లో అన్న మాటలు, ఇంకో సినిమా విడుదల పై ప్రభావం చూపించాయి. ఆ తర్వాత సాయి పల్లవి తన మాటలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను హింస గురించి మాట్లాడననీ, అవి ఉద్దేశ పూర్వకంగా అన్న మాట్లలు కాదని చెప్పారు.
అటు రణ్ బీర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆయన కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను మాంసం తింటానని, మద్యం సేవిస్తానని చెప్పారు. ఇలా అప్పుడెప్పుడో చెప్పిన మాటలు ఇటీవల వైరల్ అయ్యాయి. మాంసం, మద్యం సేవించే వాళ్లకు ఈ పాత్ర ఎలా ఇస్తారని నెటిజన్ల నుంచి కొంచెం వ్యతిరేకత ఎదురైంది. ఇక సినిమా రిలీజ్ కు ఇంకో ఏడాది కంటే ఎక్కువే సమయం ఉంది. ఈ గ్యాప్ లో ఎవరు ఏది మాట్లాడినా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. దీంతో అవన్నీ కొత్త పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే సినిమాలో నటిస్తున్న వాళ్లు ఎవరు కూడా, విడుదలయ్యేంత వరకు బహిరంగంగా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడవద్దని స్ట్రిక్ట్ గా చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ కారణంగానే స్టార్ నటులు ఎవ్వరూ కూడా మీడియా ముందు, ఇంటర్వ్యూల్లో, బయట ఎక్కడా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం లేదని ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాదా, రెండు పార్ట్ లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 2026 దీపావళి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి.
Tags:    

Similar News