ఒక్క మాట ఉల్టా... స్టార్ హీరోకి తలనొప్పులు
బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ ఇటీవల కోల్‌కతాలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా మాట్లాడుతున్న సమయంలో ఒక మాట ఉల్టా ఫల్టా అయింది. దాంతో సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది.
బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ ఇటీవల కోల్‌కతాలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా మాట్లాడుతున్న సమయంలో ఒక మాట ఉల్టా ఫల్టా అయింది. దాంతో సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది. ఒకవైపు రామాయణం వంటి గొప్ప సినిమాలో రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్ అలా ఎలా మాట్లాడుతాడు, అసలు రాముడిగా నటించే అర్హత ఉందా అంటూ సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్‌తో పాటు పలువురు హిందూ సంఘాలకు చెందిన వారు సైతం తీవ్రమైన విమర్శలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారు. నెట్టింట రణబీర్ కపూర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన నుంచి స్పందన వచ్చింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చాడు. అయినా కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. ఒక చిన్న మాట రణబీర్ కపూర్‌కి పెద్ద తలనొప్పిని తెచ్చి పెట్టింది.
దసరా వేడుకల్లో రణబీర్ కపూర్ వ్యాఖ్యలు...
రణబీర్ కపూర్ కోల్‌కతాలో జరిగిన దసరా వేడుకల్లో మాట్లాడుతూ.. ఆఖిర్ మే అంత్ సచ్చాయి ఔర్ అచ్చాయి కీ హీ హోగీ అన్నాడు. అంటే చెడు ఎంత బలమైనదైనా సరే, చివరకు అంతం అయ్యేది నిజం, మంచితనమే. అయితే ఆయన చెప్పాలి అనుకున్నది చెడుపై మంచి సాధించిన విజయం గురించి. కానీ ఉల్టాగా ఆ వ్యాఖ్యాన్ని చెప్పాడు. దాంతో వివాదం మొదలైంది. తక్కువ సమయంలోనే ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాప్తి చెందాయి. పండుగ రోజు ఏం మాటలు అంటూ కొందరు విమర్శల దాడి చేస్తే మరికొందరు రాముడి పాత్రలో నటించేందుకు నువ్వు ఎంత వరకు అర్హుడివి అంటూ ఘాటు పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రామాయణం సినిమా పబ్లిసిటీ పక్కకు పోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రామాయణ సినిమాతో నితేష్ తివారీ...
నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన రామాయణం సినిమాను ఈ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. రాముడిగా రణబీర్ కపూర్ నటించగా, సీతదేవి పాత్రతో సాయి పల్లవి ఆకట్టుకోబోతుంది. ఇక అత్యంత పవర్ ఫుల్ రావణుడి పాత్రలో కేజీఎఫ్ స్టార్ యశ్ కనిపించబోతున్నాడు. మొదటి పార్ట్‌లో రాముడు, సీతలపై ఎక్కువ సన్నివేశాలు ఉంటాయని, యశ్ కు సంబంధించిన రావణుడి సీన్స్ తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఇక హనుమంతుడి పాత్ర విషయంలోనూ అదే చర్చ జరుగుతోంది. రెండో మరియు మూడో పార్ట్‌లో రావణుడి పాత్రను హైలైట్ చేస్తారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రామాయణం సినిమా కోసం సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామాయణం సినిమా ప్రమోషన్ కోసం యూనిట్ సభ్యులు దేశ వ్యాప్తంగా పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ల రామాయణ మూవీ...
పబ్లిసిటీ కార్యక్రమాల్లో స్టార్స్ ప్రతి మాటను ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని మరోసారి ఈ ఘటనతో నిరూపితం అయ్యింది. రణబీర్ కపూర్ చిన్న మాట తూలడంతో ఏకంగా రామాయణం సినిమాకు నెగిటివ్ టాక్ ను కొందరు స్ప్రెడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. కనుక సినిమా విడుదల సమయంలో సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోలు, హీరోయిన్స్ ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. పెద్ద వేదికలపై మాట్లాడుతున్న సమయంలో చిన్న చిన్న పొరపాట్లు కూడా దొర్లకుండా జాగ్రత్తగా ఉండాలి. రణబీర్ కపూర్ చిన్న మాట ఉల్టా కావడంతో చాలా పెద్ద డ్యామేజీ జరిగింది. చెన్నైలో జరిగిన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో వివరణ ఇచ్చుకున్న జరగాల్సిన నష్టం జరిగింది. యాంటీ ఫ్యాన్స్ ఆయన వివరణ పట్టించుకోకుండా సినిమాను ట్రోల్ చేయడం, ఆయన వ్యాఖ్యలను మరింత లౌడ్ గా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరుగుతుంది. సినిమా విడుదలకు ఇంకాస్త సమయం ఉంది కనుక అప్పటి వరకు అంతా సైలెంట్ అవుతుందేమో చూడాలి.