రానా గేమ్ ఛేంజ్ చేయాల్సిందేనా..?

ఐతే రానా సినిమాల పరంగా వెరైటీ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నా అవైనా వెంట వెంటనే చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.;

Update: 2025-11-15 05:19 GMT

దగ్గుబాటి వారసుడు రానా కెరీర్ ని తనకు నచ్చినట్టుగా ప్లాన్ చేసుకున్నాడు. ఈ రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఫార్మెట్ తనకు నచ్చదని చెప్పినట్టుగానే వెరైటీ కథలతో రానా ఏమైనా చేయగలడు అనేలా క్రేజ్ తెచ్చుకున్నాడు. వెంకటేష్ అయినా హీరోగానే చేస్తూ వచ్చాడు కానీ రానా ఒక అడుగు ముందుకేసి విలన్ గా కూడా అదరగొట్టేస్తున్నాడు. బాహుబలిలో భళ్లాలదేవ పాత్రలో రానా అద్భుతమైన అభినయం సినిమా హైలెట్స్ లో ఒకటిగా నిలిచిందని తెలిసిందే.

రెండు మూడేళ్లకు ఒక సినిమాతో రానా..

ఐతే రానా సినిమాల పరంగా వెరైటీ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నా అవైనా వెంట వెంటనే చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. రెండు మూడేళ్లకు ఒక సినిమాతో రానా వస్తుండటం ఆయన ఫ్యాన్స్ ని అప్సెట్ చేస్తుంది. రానా లేటెస్ట్ గా కాంత సినిమాలో ఒక ప్రత్యేకమైన రోల్ లో నటించారు. సినిమాలో రానా నటన గురించి అందరు చర్చిస్తున్నారు. దుల్కర్ కూడా కాంతాతో మరోసారి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడని అంటున్నారు.

కాంతా సినిమాలో రానా చేసిన పాత్ర తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ వర్త్ వాచింగ్ అనిపించాయి. ఐతే రానా సోలో లీడ్ గా చేయకుండా ఇలాంటి రోల్స్ ఎందుకు చేస్తున్నాడంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. విలన్ గానే రానా తన కెరీర్ ని ప్లాన్ చేస్తున్నాడా హీరోగా చేయాలని అనుకోవట్లేదా అనే చర్చ మొదలైంది. రానా కూడా డిఫరెంట్ గా ఉండేలా ఉన్న ఎలాంటి పాత్ర అయినా చేస్తా అని అంటున్నాడు. నేను చేసే పాత్ర ఇదివరకు తాను చూసి ఉండకూడదు అనే ఫార్ములాతో రానా ఇలాంటి రోల్స్ చేస్తున్నాడు.

కథలు కుదరట్లేదా లేదా రానానే టైం తీసుకుంటున్నాడా..

ఐతే అంతా బాగుంది కానీ రానా ఇప్పుడు నిజంగానే గేమ్ ఛేంజ్ చేయాల్సిన టైం వచ్చింది. సోలో లీడ్ సినిమాల కథలు కుదరట్లేదా లేదా రానానే టైం తీసుకుంటున్నాడా అన్నది తెలియదు కానీ రానా మాత్రం చాలా గ్యాప్ తీసుకుంటూ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తున్నాడు. రానా చేస్తున్న ఈ స్పెషల్ రోల్స్ కొంతవరకు బెటర్ అనిపిస్తున్నా ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా అతని సినిమాలు ఉండట్లేదని టాక్.

త్రివిక్రం ఆధ్వర్యంలో రానా హిరణ్యకశ్యప కథ సినిమాగా చేయాలని అనుకున్నారు. కానీ మహావతార్ నరసింహా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అటెంప్ట్ చేస్తారన్న గ్యారెంటీ లేదు. రానా కూడా నెక్స్ట్ సినిమాలు ఏం చేస్తున్నాడు అన్న అప్డేట్ కూడా లేదు. కెరీర్ విషయంలో రానా నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది గెస్ చేయలేకపోతున్నారు. మరి ఫ్యాన్స్ అభ్యర్ధనను రానా అర్ధం చేసుకుని వరుస సినిమాలు ప్లాన్ చేస్తాడేమో చూడాలి. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో రానా చేస్తున్న ప్రయత్నాలు ఇంప్రెస్ చేస్తున్న అతని సోలో సినిమాల కోసం దగ్గుబాటి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి రానా ఫ్యాన్స్ కోరిక ఎప్పుడు నెరవేరుస్తాడన్నది చూడాలి.

Tags:    

Similar News