• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్ పై డబుల్ భారం!

రామ్ పై డబుల్ భారం!

| పూరి జగన్నాథ్ చార్మి కాంబినేషన్లో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్కసారి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ చూశారు

By - Tupaki Desk
Update: 2023-07-31 08:28 GMT

పూరి జగన్నాథ్, చార్మి కాంబినేషన్లో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్కసారి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ చూశారు. చార్మి నిర్మాణ భాగస్వామ్యంలో పూరి జగన్నాథ్ జ్యోతిలక్ష్మి రోగ్ పైసా వసూల్ మెహబూబా వంటి సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఆ సినిమాలో వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఊహించిన విధంగా సక్సెస్ అందుకున్నారు.

ఆ తర్వాత పూరి కొడుకుతో రొమాంటిక్ అనే సినిమా చేయగా అది దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇక లైగర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతో అయితే పూరి కెరీర్ పై కూడా చాలా ప్రభావం పడింది. అంతే కాకుండా ఆర్థికంగా కూడా చాలా రోజులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా పూరిపై విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు.

అయితే ఈ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్న పూరి ఛార్మి ఇద్దరు కూడా తదుపరి సినిమా పైనే చాలా ఆశలు పెట్టుకున్నారు. రామ్ పోతినేనితో మళ్ళీ ఇస్మార్ట్ కాంబినేషన్ను రిపీట్ చేస్తూ డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నారు. రామ్ పోతినేని మాస్ హీరో గా అయితే మంచి క్రేజ్ అందుకుంటూ వస్తున్నాడు.

ఈ సినిమా సక్సెస్ అయితే అతని కెరీర్ మీద పెద్దగా ప్రభావం పడకపోవచ్చు కానీ పూరి, చార్మిల మీద మాత్రం తీవ్రస్థాయిలో ప్రభావం పడే అవకాశం ఉంది. లైగర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో దూసుకుపోవాలి అనుకున్న పూరీ ఛార్మికి కోలుకోవాలని దెబ్బ పడింది. ఇక మొత్తానికి రామ్ మాత్రమే వారిని మరోసారి నమ్ముతున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ను ఇటీవల ముంబైలో ఫినిష్ చేశారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ను విదేశాల్లో మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ ఊహించని స్థాయిలో ఉంటాయట. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2024 మార్చి 8వ తేదీన విడుదల చేయాలని ముందే క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక మరోవైపు రా రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న స్కంద సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

Tags:    
  • Doubleismart 
  • Ismartshankar 
  • Purijagannadh 
  • Rampothineni 
  • Charmee 
  • Doubleismartfilm 
  • Ligerfilm 
  • Vijaydevarakonda 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS