• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భార్య-కూతురితో చరణ్​​.....

భార్య-కూతురితో చరణ్​​.. తొలిసారి ఇలా..

| టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీలైనంత వరకు ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2023-10-18 11:10 GMT

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీలైనంత వరకు ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య భార్యతో కలిసి ఫారెన్ ట్రిప్స్​కు కూడా వెళ్తున్నారు. అయితే మరోసారి చరణ్ ఫారిన్ వెకేషన్​కు వెళ్లారు. తన భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి హాలీడే ట్రిప్​కు వెళ్లారు. కూతురుతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ క్రమంలోనే హైదరాబాద్ విమానాశ్రయంలో చరణ్-ఉపాసన దంపతులు మీడియా కంటికి కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ చేతిలో పెట్ డాగ్ రైమ్ కనిపించగా.. ఉపాసన క్లీంకారను ఎత్తుకుని ఉంది. చరణ్ - ఉపాసన ఇద్దరూ క్యాజువల్ లుక్​లో సింపుల్​గా కనిపించారు.

అయితే పాప క్లీంకార ముఖం ఫోటోలకు కనిపించకుండా ఉపాసన చేతిని అడ్డుగా పెట్టుకుని నడిచింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు, అభిమానులు క్లీంకార ముఖం కనిపిస్తే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. హ్యాపీ వెకేషన్ ట్రిప్.. హ్యాపీగా గడిపేసి రండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే.. RRRతో బిగ్గెస్ట్​ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్​తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా ఇది రూపొందుతోంది.దిల్ రాజు భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానుంది. విజయ దశమి కానుకగా చిత్రంలోని ఫస్ట్ సింగిల్​ను రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలిసింది.

ఈ చిత్రం తర్వాత చరణ్​.. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ స్పార్ట్స్ డ్రామా చేయబోతున్నారు. ఇందులో రవీనా టాండన్ కూతురు హీరోయిన్​గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా సెట్స్​పైకి వెళ్లనుంది. ఇతర కాస్ట్ వివరాలు ఇంకా తెలియలేదు. చూడాలి మరి ఈ రెండు చిత్రాలు ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటాయో.. వీటికోసమైతే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    
  • Ramcharan 
  • Upasana 
  • Megafamily 
  • Filmindustry 
  • Italywedding 
  • Klinkara 
  • Gamechangermovie 
  • Shankar 
  • Varunlavwedding 
  • MegaFamilyWedding 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS