• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గేమ్ చేంజర్'లో హైలైట్...

'గేమ్ చేంజర్'లో హైలైట్ సీక్వెన్స్

| చరణ్ షూట్‌లోకి అడుగు పెట్టిన తొలి రోజు, షూట్ పూర్తి చేసుకుని వెళ్తున్న చివరి రోజుకు సంబంధించిన దృశ్యాలకు సంబంధించి హింట్ ఇచ్చేలా ఉంది ఈ పోస్టు.

By - Tupaki Desk
Update: 2024-07-09 23:30 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం 'గేమ్ చేంజర్'. అనివార్య కారణాల వల్ల చాలా ఆలస్యం అయిన ఈ చిత్రం.. ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇటీవలే సినిమాలో రామ్ చరణ్ పోర్షన్ అంతా పూర్తయిపోయిన విషయాన్ని దర్శకుడు శంకర్, నిర్మాతలు ధ్రువీకరించారు. ఇంకో 10-15 రోజులు మాత్రమే షూట్ మిగిలి ఉన్నట్లు కూడా శంకర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ‘గేమ్ చేంజర్’ ఎంతకీ పూర్తి కావట్లేదని డీలా పడిపోతున్న చరణ్ అభిమానుల్లో ఉత్సాహం వచ్చింది. ఇదిలా ఉంటే.. ‘గేమ్ చేంజర్’లో చరణ్ తన పార్ట్ పూర్తి చేసుకుని వెళ్తున్న నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్టు పెట్టారు. చరణ్ షూట్‌లోకి అడుగు పెట్టిన తొలి రోజు, షూట్ పూర్తి చేసుకుని వెళ్తున్న చివరి రోజుకు సంబంధించిన దృశ్యాలకు సంబంధించి హింట్ ఇచ్చేలా ఉంది ఈ పోస్టు.

తొలి దృశ్యంలో చరణ్ బనియన్, లుంగీ ధరించి హెలికాఫ్టర్ వైపు వెళ్తుంటే.. రెండో దృశ్యంలో ఫార్మల్ డ్రెస్‌లో హెలికాఫ్టర్ వెళ్తున్నాడు. అంటే షూట్ మొదలైన రోజు, చివరి రోజు ఈ హెలికాఫ్టర్ ఎక్కే దృశ్యాలనే తీశారా అనే చర్చ జరుగుతోంది. ఆ సంగతేమో కానీ.. సినిమాలో ఈ హెలికాఫ్టర్ నేపథ్యంలో హైలైట్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందన్నది చిత్ర వర్గాల సమాచారం. బనియన్-లుంగీలోనే హెలికాఫ్టర్ ఎక్కి వెళ్లి విలన్ల పని పెట్టే సీక్వెన్స్‌ను శంకర్ అత్యద్భుతంగా చిత్రీకరించారని.. థియేటర్లు హోరెత్తిపోయేలా ఈ ఎపిసోడ్ ఉంటుందని.. చరణ్ అభిమానులకు అది పండగేనని అంటున్నారు. శంకర్ సినిమాల్లో కొత్తదనం ఉంటూనే మాస్‌ను ఊపేసే సన్నివేశాలూ ఉంటాయి. ‘శివాజీ’, ‘రోబో’ లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ‘గేమ్ చేంజర్’ కూడా ఆయన మైల్‌స్టోన్ మూవీస్‌లో ఒకటి కాగలదనే అంచనాలున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ ఒక కొలిక్కి వచ్చాకే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని శంకర్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.

It’s been a MEGA POWER PACKED journey from the first day of shooting to the last for our #GameChanger @AlwaysRamCharan 🔥🔥

𝐈𝐭’𝐬 𝐚 𝐰𝐫𝐚𝐩 ❤️‍🔥

Bringing you some Blistering Updates soon 💥🤟🏻 @shankarshanmugh @advani_kiara @MusicThaman @DOP_Tirru @artkolla @SVC_official… pic.twitter.com/hn8zciY0yp

— Sri Venkateswara Creations (@SVC_official) July 8, 2024
Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Gamechanger 
  • Ramcharan 
  • Shankar 
  • Srivenkateswaracreations 
  • Tweet 
  • Socialmedia 
  • Helicopter 

Similar News

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

Copyright @2026

Powered by Blink CMS