గేమ్ ఛేంజర్ దే పైచేయి.. దేవర కూడా తక్కువేం కాదు!

ఇక గేమ్ ఛేంజర్ హిందీ హక్కులను పాపులర్‌ డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాత అనిల్ తడానీ రూ.75 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ మూవీ నార్త్ లో రూ.150-160 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

Update: 2024-04-28 15:30 GMT

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ బాక్సాఫీస్‌ ను ఒక్కసారిగా షేక్ చేశారు టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌. ప్రస్తుతం వీరిద్దరూ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చేస్తుండగా.. ఎన్టీఆర్ దేవరలో నటిస్తున్నారు. ఆ తర్వాత కూడా వారి లైనప్ క్రేజీగా ఉంది. ఇద్దరూ అదిరిపోయే ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అయితే టాలీవుడ్ అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో ఒకటైన పుష్ప-2 నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ విషయంలో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కల్కి హిందీ హక్కులు రూ.100 కోట్లకు అమ్ముడయ్యాయని టాక్. ఇక హిందీ థియేట్రికల్ రైట్స్ విషయంలో ఎన్టీఆర్ దేవరను చరణ్ గేమ్ ఛేంజర్ బీట్ చేసిందని ఈ మధ్య సినీ వర్గాల్లో గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి.

ఇక గేమ్ ఛేంజర్ హిందీ హక్కులను పాపులర్‌ డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాత అనిల్ తడానీ రూ.75 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ మూవీ నార్త్ లో రూ.150-160 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. పుష్ప-2, కల్కి తర్వాత భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా గేమ్ ఛేంజర్ నిలవనుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తారక్ దేవర కన్నా బాగా రాణించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇదంతా డైరెక్టర్ శంకర్ వర్క్ పైనే ఆధారపడి ఉందని అంటున్నారు. శంకర్ కు నార్త్ లో మంచి క్రెడిబిలిటీ ఉంది. 1996లో శంకర్ తెరకెక్కించిన భారతీయుడు హిందీ వెర్షన్ భారీ విజయాన్ని సాధించింది. రూ.1.5 కోట్ల వసూళ్లు రాబట్టి అప్పట్లో పెద్ద హిట్ అయింది. 2010లో రోబో సంచలనం సృష్టించగా.. ఆ మూవీ సీక్వెల్ రోబో 2.0 హిందీలో రూ.190 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

Read more!

ఇక శంకర్ బ్రాండ్, ఆర్ఆర్ఆర్ తో సంపాదించుకున్న చరణ్ క్రేజ్, హీరోయిన్ కియారాకు ఉన్న పాపులారిటీ.. గేమ్ ఛేంజర్ కు ప్లస్ పాయింట్ గా మారనుందని సినీ పండితులు చెబుతున్నారు. టీజర్, ట్రైలర్, పాటల రిలీజ్ తర్వాత మూవీపై మంచి బజ్ క్రియేట్ అయితే భారీ ఓపెనింగ్స్ సాధించడం పక్కా అని అంటున్నారు. అలా అని దేవరలో కూడా హిందీ ఆడియన్స్ ను ఆకట్టుకునే మంచి దేశీ యాక్షన్ ఉందని చెబుతున్నారు. మరి నార్త్ లో గేమ్ ఛేంజర్, దేవర ఎలా రాణిస్తాయో చూడాలి.

Tags:    

Similar News