• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరోసారి చరణ్‌ చిట్టిబాబు...

మరోసారి చరణ్‌ చిట్టిబాబు లుక్‌...!

| ఇటీవలే సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు లాంచనంగా ప్రారంభం అయ్యాయి.

By - Tupaki Desk
Update: 2024-10-29 05:37 GMT

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'గేమ్‌ ఛేంజర్‌' షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయిందని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా గేమ్‌ ఛేంజర్‌ సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. గేమ్‌ ఛేంజర్‌ సినిమా విడుదలకు ముందే రామ్‌ చరణ్ తన తదుపరి సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే. ఇటీవలే సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు లాంచనంగా ప్రారంభం అయ్యాయి. వచ్చే నెల నుంచి రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు.


ఉప్పెన సినిమాతో సూపర్‌ హిట్‌ను దక్కించుకున్న బుచ్చిబాబు ఆలస్యం అయినా అద్భుతమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అని ఆయన సన్నిహితులు నమ్మకంగా చెబుతున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రామ్మూర్తి నాయుడు అనే బాడీ బిల్డర్‌ జీవిత కథ నుంచి కొన్ని సంఘటనలు తీసుకుని రాసుకున్న కథ అనే వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నెల రోజుల పాటు ఈ సినిమా కోసం రామ్‌ చరణ్ విదేశాల్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని బాడీ బిల్డర్‌గా మారాడట. బాడీ బిల్డర్స్‌ ఎలా ఉండాలి, వారు ఎలా నడుచుకుంటారు అనే విషయాలను గురించి చరణ్ కి ప్రత్యేకంగా వర్క్‌ షాప్ నిర్వహించారని సమాచారం అందుతోంది.

రామ్ చరణ్ ఫిజిక్ మాత్రమే కాకుండా మొత్తం లుక్‌ను దర్శకుడు బుచ్చిబాబు మార్చడం జరిగిందని తాజాగా ఆయన్ను చూసిన వారు ఎవరైనా అనుకుంటున్నారు. తాజాగా చిరంజీవి ఏయన్నార్‌ జాతీయ అవార్డును అమితాబ్ బచ్చన్‌ చేతుల మీదుగా అందుకున్న విషయం తెల్సిందే. ఆ కార్యక్రమంలో రామ్‌ చరణ్‌ సైతం పాల్గొన్నారు. చరణ్ లుక్‌ కొత్తగా ఉందని అక్కడ చర్చ జరిగిందట. గతంలో రంగస్థలం సినిమా కోసం రామ్‌ చరణ్ గడ్డం బాగా పెంచాడు. ఇప్పుడు బుచ్చిబాబు సినిమా కోసం అచ్చు అలాగే గడ్డం పెంచి కనిపించాడు. చరణ్ గడ్డం లుక్‌ లో బాగున్నాడని గతంలోనే టాక్ వచ్చింది. కనుక ఈసారి అంతకు మించి ఉండే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రంగస్థలం సినిమాలో రామ్‌ చరణ్ గడ్డం లుక్‌ లో కనిపించి కాస్త బరువు తక్కువ కనిపిస్తారు. కానీ బుచ్చిబాబు సినిమాలో మాత్రం రామ్‌ చరణ్ గడ్డం లుక్‌ లో అచ్చు చిట్టిబాబు లుక్‌ లో కనిపించడంతో పాటు కాస్త ఫిజిక్‌ను పెంచి కనిపించబోతున్నారని తాజా ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. మొత్తానికి రామ్‌ చరణ్‌ లుక్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బుచ్చిబాబు తన గురువు సుకుమార్‌ చూపించినట్లుగానే రామ్ చరణ్ ను మాస్‌ లుక్‌ లో, సింపుల్‌ అండ్‌ రియలిస్టిక్ గా చూపించాలనే ఉద్దేశంతో గడ్డంలో చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్‌ చరణ్ కి జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో లేదా 2026 సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    
  • Anrnationalawards 
  • Anrnationalawards2024 
  • Tollywood 
  • Filmindustry 
  • Gamechanger 
  • Shankar 
  • RC16 
  • Buchibabusana 
  • Ramcharan 
  • Virallook 
  • Anrawards 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS