ఆమె వల్లే మా ఆయన్ను ఫాలో అవడం లేదు!
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన రంభ గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ రంభ తన రీఎంట్రీకి రెడీ అవుతోంది.;
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన రంభ గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ రంభ తన రీఎంట్రీకి రెడీ అవుతోంది. 1992లో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఆమె నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల సరసన నటించి రంభ స్టార్ హీరోయిన్ అయిపోయింది.
కేవలం యాక్టింగ్ తోనే కాకుండా తన అందంతో కూడా రంభ ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. సౌత్ లోని స్టార్ హీరోలందరితో కలిసి నటించిన రంభ గ్లామర్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును అందుకుంది. రంభ ఎంత క్రేజ్ అందుకుందో చెప్పడానికి అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహా సముద్రం సినిమాలో ఆమెపై ఉన్న స్పెషల్ సాంగే ఉదాహరణ.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ, భోజ్‌పురి సినిమాల్లో నటించి మెప్పించిన రంభ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో కూడా మెరిసి అదరగొట్టింది. రీఎంట్రీకి రెడీ అవుతున్న క్రమంలో భాగంగా రంభ అడిగిన వారికి ఇంటర్వ్యూలిస్తూ మెల్లిగా లైమ్ లైట్ లోకి వస్తోంది.
అందులో భాగంగా రంభ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తాను తన భర్తను ఫాలో అవనని, దానికి కారణం ఓ హీరోయిన్ అని రంభ చెప్పింది. తన భర్త ముందుగా ఆమెను ఫాలో అవకుండా మిల్కీ బ్యూటీ తమన్నాను ఫాలో అయ్యాడనే కారణంతో తాను ఇప్పటికీ సోషల్ మీడియాలో అతన్ని ఫాలో అవడం లేదని వెల్లడించింది. హీరోయిన్ అయినప్పటికీ తనక్కూడా పొసెస్సివ్‌నెస్ ఉంటుందని రంభ సరదాగా చెప్పింది.