వీఎఫ్ఎక్స్ కోసమే అంత టైమా రామా?
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి రిలీజ్ కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది.;
రామాయణ గాధపై ఇప్పటికే ఎన్నో సినిమాలు, సీరియల్స్ రాగా ఇప్పుడు బాలీవుడ్ లో అదే కథ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా రానున్న విషయాన్ని కూడా మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
రెండు భాగాలుగా రానున్న రామాయణ
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి రిలీజ్ కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది. రామాయణలో కన్నడ రాక్ స్టార్ యష్ రావణుడిగా నటించనుండగా, బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. కైకేయిగా లారా దత్తా, సూర్ఫనఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు.
రామాయణ1 ఎడిటింగ్ వర్క్ పూర్తి
భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది. రామాయణ పార్ట్1 కు సంబంధించిన ఫైనల్ ఎడిటింగ్ పూర్తైందని తెలుస్తోంది. ఎడిటింగ్ వర్క్ ను పూర్తి చేసుకున్న మేకర్స్ ఇప్పుడు వీఎఫ్ఎక్స్ వర్క్స్ ను పూర్తి చేయడానికి రెడీ అవుతుందని, అందులో భాగంగానే 300 రోజులను కీలకమైన వీఎఫ్ఎక్స్ ను ఫినిష్ చేయడానికి కేటాయించిందని సమాచారం.
ఆల్రెడీ రామాయణపై భారీ అంచనాలుండగా, సినిమా నుంచి బయటకి వచ్చిన లీకులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మొన్నా మధ్య సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. రామాయణ సినిమా ఇండియన్ సినిమాలో చరిత్ర సృష్టిస్తుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.