రామాయణ్ కు ఆదిపురుష్ తో పోలిక.. మిస్ ఫైర్ అయ్యే ఛాన్స్ లేదు!
ఈ క్రమంలో ఈ సినిమా కంటే ముందు బాలీవుడ్ నుంచి వచ్చిన ఆదిపురుష్ సినిమాకి అప్పట్లో మేకర్స్ ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ ఇప్పుడు రామాయణ విషయంలో వైరల్ గా మారింది.;
బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ 'రామాయణ్'. రామయాణం ఇతిహాసంగా దర్శడుకు నితీష్ తివారీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నమిత్ మల్హోత్ర ఈ ప్రాజెక్ట్ ను రూ.4000 కోట్ల భారీ ఖర్చుతో రూపొందిస్తున్నట్లు ఇటీవల ఆయనే స్వయంగా వెల్లడించారు.
అయితే కథ డిమాండ్ మేరకు సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ కు భారీ సెట్టింగులు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా కంటే ముందు బాలీవుడ్ నుంచి వచ్చిన ఆదిపురుష్ సినిమాకి అప్పట్లో మేకర్స్ ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ ఇప్పుడు రామాయణ విషయంలో వైరల్ గా మారింది.
ఈ రామాయణ సినిమాలో వానర సైన్యం కోసం ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లో కనిపించే తరహా టెక్నాలజీ వాడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఆదిపురుష్ సమయంలో కూడా ఇదే మాట అప్పట్లో వినిపించింది. తాము కూడా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో అవతార్ తరహాలో గ్రాఫిక్ తీర్చిదిద్దారని అన్నారు. దీని కారణంగానే ఆదిపురుష్ కు ఓవర్ బడ్జెట్ అయ్యిందని వార్తలు వచ్చాయి.
ఇప్పుడు రామాయణ్ కు కూడా అదే తరహా విజువల్స్ వాడనున్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే ఆదిపురుష్ లో వానర సేన ఎపిసోడ్ గ్రాఫిక్స్ మిస్ ఫైర్ అయ్యాయి. ఇవి మూవీ లవర్స్ ను అంతగా మెప్పించలేక పోయాయి. అయితే రామాయణ్ కూ రూ.4000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. కాబట్టి ఇందులో క్వాలిటీ గ్రాఫిక్స్, గ్రాండ్ విజువల్స్ ఆశించవచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు.
అయితే రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. అంచనాలకు తగ్గట్లే ఈ వీడియో గ్లింప్స్ ఉన్నాయి. మొత్తం గ్రాండ్ విజువర్స్ తో ఈ వీడియోను తీర్చి దిద్దారు. అంటే సినిమా లో ఏ రేంజ్ లో విజువల్స్ ఉండనున్నాయో ఈ గ్లింప్స్ తో హింట్ ఇచ్చారు మేకర్స్. అందుకే అటు ఆడియెన్స్ కూడా మంచి ఔట్ పుట్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు.
కాగా, ఇందులో రణ్ బీర్ కపూర్ రాముడిగా, అలాగే సాయి పల్లవి సీత పాత్రల్లో నటిస్తున్నారు. కన్న స్టార్ యష్, కాజల్ అగర్వాల్, సన్నీ డియోల్ లాంటి ఇతర బిగ్ స్టార్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు పార్ట్ లుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2026 దీపావళికి తొలి భాగం, రెండో పార్ట్ 2027 దీపావళి కి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.