• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  18 ఏళ్ల తర్వాత వెంకీ కోసం...

18 ఏళ్ల తర్వాత వెంకీ కోసం లక్ష్మి మ్యూజిక్ డైరెక్టర్!

| ఈ క్రమంలో తాజాగా సినిమాకి సంబంధించిన మ్యూజికల్ అప్‌డేట్‌ను మేకర్స్ అందించారు.

By - Tupaki Desk
Update: 2024-11-13 14:17 GMT

విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''సంక్రాంతికి వస్తున్నాం''. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీని వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా సినిమాకి సంబంధించిన మ్యూజికల్ అప్‌డేట్‌ను మేకర్స్ అందించారు. ఫస్ట్ సింగిల్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల వర్క్‌ చేస్తున్నట్లు తెలిపారు.

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓ పాటను రమణ గోగులతో పాడిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా చిత్ర బృందం వెల్లడించింది. 'గోదారి గట్టుమీద రామచిలకవే.. గోరింటాకెట్టుకున్న చందమామవే' అంటూ సాగే ఈ పాటకు ట్యూన్ అదిరిపోయింది.. భాస్కర భట్ల లిరిక్స్ చించి అవతలేశారు. ఇంత మంచి పాటను రెగ్యులర్ ప్లేబ్యాక్ సింగర్‌గా కాకుండా, విలక్షణమైన వాయిస్‌తో పాడించాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావించారు. రమణ గోగులతో ఈ పాటను పాడించాలని సూచించారు. దీంతో వెంటనే భీమ్స్ ఆయనకు కాల్ చేసి రిక్వెస్ట్ చేసినట్లు ఈ వీడియోలో చూపించారు.

తెలుగు ప్రేక్షకులకు రమణ గోగుల గురించి పరిచయాలు అవసరం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా, లిరిసిస్ట్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమంటే ఇదేరా, తమ్ముడు, బద్రి, జానీ, మౌనమేలనోయి, లక్ష్మీ, అన్నవరం, యోగి వంటి ఎన్నో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ కి మ్యూజిక్ అందించారు. వాటిల్లో ఎన్నో పాటలు పాడి, తన వాయిస్ తో సంగీత ప్రియులను అలరించారు. 2013లో వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌', '1000 అబద్ధాలు' సినిమాల తర్వాత ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే దాదాపు 11 ఏళ్ల తర్వాత మళ్ళీ రమణ గోగుల తన గొంతు సవరించుకుంటున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కోసం పాట పాడుతున్నారు.

రమణ గోగుల చివరిగా వెంకటేష్ కోసం 'లక్ష్మి' వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించారు. ఇందులో 'ధగ ధగ' 'హే సత్యభామ' రీమిక్స్ పాటలను ఆలపించారు. 18 ఏళ్ల తర్వాత మళ్లీ వెంకీ కోసం 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలోని 'గోదారి గట్టుమీద' సాంగ్ కి తన గాత్రాన్ని అందించడం విశేషం. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటకు రమణ గోగుల స్పెషల్ వాయిస్ యాడ్ అవ్వడం మ్యూజిక్ లవర్స్ కు వింటేజ్ మ్యూజికల్ ట్రీట్ ఇస్తుందని అనడంలో సందేహం లేదు. త్వరలో ఈ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.

'ఎఫ్ 2' 'ఎఫ్ 3' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' పై అందరిలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇది యాక్షన్‌ నేపథ్యంలో సాగే ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్. ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్రల చుట్టూ తిరిగే కథతో రాబోతోంది. ఇందులో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఎస్ కృష్ణ & జి ఆదినారాయణ స్క్రీన్‌ప్లేను అందిస్తున్న ఈ చిత్రానికి వి వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. 2025 సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

A special song calls for a very special singer to bring the magic to life❤️‍🔥

After 18 Long years, Bringing back the blockbuster vintage combo of Victory @VenkyMama and @RamanaGogula for a chartbuster tune composed by #BheemsCeciroleo 💥

-- https://t.co/HWcxIst1F3… pic.twitter.com/LGW5gGNLUR

— Sri Venkateswara Creations (@SVC_official) November 13, 2024
Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • F2 
  • F3 
  • SankranthikiVasthunnam 
  • Venkatesh 
  • Meenakshichaudhary 
  • Aishwaryarajesh 
  • Anilravipudi 
  • Ramanagogula 
  • Badri 
  • Johny 
  • Lakshmi 
  • Shrish 
  • Dilraju 
  • SriVenkateswaracreationsbanner 

Similar News

సాయి ప‌ల్ల‌వి కెరీర్ లో తొలి 1000 కోట్లు!

2026-11-17 12:46 GMT

32 దేశాల్లో సంచలనం సృష్టించిన రణవీర్ సింగ్ మూవీకి ఘోర అవమానం!

2026-11-17 12:46 GMT

దాదా వ‌ర్సెస్ కాకా..ద‌బిడి దిబిడే!

2026-11-17 12:45 GMT

ఆ మూవీ సెట్లో టార్చర్ చూపించారు..నేను చేసిన తప్పు అదే - పూజిత పొన్నాడ!

2026-11-17 11:15 GMT

చైతూ.. పుష్ప బ్రాండ్ కలిసొచ్చేనా?

2026-11-17 10:37 GMT

తప్పు ఎవరిదైనా శిక్ష ఆడదానికేనా.. సమంత సూటి ప్రశ్న?

2026-11-17 10:33 GMT

బిగ్ బాస్ బ్యూటీ.. బూతు పాటతో వార్నింగా?

2026-11-17 10:32 GMT

పట్టుచీరలో సీతమ్మ ఎంత అందంగా ఉందో!

2026-11-17 10:21 GMT

కొత్త సమస్యలో చిక్కుకున్న జూనియర్ ఎన్టీఆర్..!

2026-11-17 10:20 GMT

నెపోటిజం విమర్శలపై అనన్య పాండే స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-17 10:20 GMT

అప్ కమింగ్ హీరోలకు స్టోరీ సెలెక్షన్ తెలియడం లేదా?

2026-11-17 10:19 GMT

జానీ మూవీ అందరికీ నచ్చుతుంది కానీ ప్లాప్ అవ్వడానికి కారణం ఇదే...

2026-11-17 10:13 GMT

Copyright @2026

Powered by Blink CMS