దేవర.. అప్పుడే మరో లీక్ ఇచ్చేశారు!

ఇదిలా ఉంటే తాజాగా దేవర మూవీ సాంగ్స్ కి సంబంధించి లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రీ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Update: 2024-05-18 05:02 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సిద్ధమవుతోన్న మూవీ దేవర. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని మే 19న రిలీజ్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఒక రోజు ముందుగానే దేవర ఫస్ట్ సింగిల్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. మొదటి పాటగా ఫియర్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబందించిన ప్రోమో కూడా వదిలారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకొని తారక్ దేవర మూవీ చేస్తున్నారు. అందుకే ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా దేవర మూవీ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. దేవర మూవీ సాంగ్ విని ఫుల్ ఎనర్జీతో తారక్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దేవర మూవీ సాంగ్స్ కి సంబంధించి లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రీ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Read more!

ఒక్క రోజు వెయిట్ చేయండి. మన అనిరుద్… అబ్బా వర్తు వెయిటింగ్ అని అందరి నోటా అనిపిస్తాడు. రెండో పాట రికార్డింగ్ కోసం చెన్నై వచ్చా… ఇది ఇంకో రకం ప్రకంపనం. అది కోత అయితే ఇది లేత అంటూ పరోక్షంగా సెకండ్ సాంగ్ ఎలా ఉండబోతోందనేది క్లారిటీ ఇచ్చాడు. అలాగే మొదటి సాంగ్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోందని చెప్పి ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెంచేశాడు.

ఇక రెండో పాట డాన్స్ నెంబర్ గా ఉండబోతోందని రామజోగయ్య శాస్త్రీ ట్వీట్ బట్టి అర్ధమవుతోంది. తారక్, జాన్వీ కపూర్ మీద చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ ని సెకండ్ సింగిల్ గా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని స్పష్టం అవుతోంది. ఈ సాంగ్స్ క్లిక్ అయితే మాత్రం దేవర మూవీ మీద అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. గత ఏడాది జైలర్, లియో సినిమాలతో అనిరుద్ మ్యూజికల్ గా సూపర్ సక్సెస్ లు అందుకున్నాడు.

అంతకు మించి దేవర ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అనిరుద్ కూడా టాలీవుడ్ లో ఎలా అయిన సక్సెస్ కొట్టాలనే కసితో ఈ సారి మ్యూజిక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివకి కూడా ఈ మూవీ చాలా కీలకంగా ఉంది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత చేస్తోన్న సినిమా కావడంతో గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. అలాగే రాజమౌళితో మూవీ చేసిన తర్వాత మూడు సార్లు నెక్స్ట్ సినిమాలతో తారక్ ఫ్లాప్ లు అందుకున్నాడు. ఈ సారి మాత్రం ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నాడు.

4
Tags:    

Similar News