శ్రీరాముని మార్గంలో 'రామం'.. టాలీవుడ్ లో మరో పాన్ ఇండియా ప్రయోగం

ఈ సినిమా రూపకల్పనను ఎంతో నమ్మకంగా, స్థిరంగా రూపొందిస్తున్నారు నిర్మాత వేణు దొనేపూడి. ఆయన మాట్లాడుతూ “శ్రీరాముని నామం ఈ దేశానికి ఒక మార్గదర్శక మంత్రం లాంటిది.;

Update: 2025-04-06 06:55 GMT

శ్రీరామనవమి సందర్భంగా ‘చిత్రాలయం స్టూడియోస్’ అధినేత వేణు దొనేపూడి నిర్మాణంలో మరో విభిన్నమైన పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘రామం: ది రైజ్ ఆఫ్ అఖిరా’ అనే ట్యాగ్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుల వద్ద శిక్షణ పొందిన యువ దర్శకుడు లోకమాన్య దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను ప్రత్యేకంగా విడుదల చేస్తూ పవిత్ర రామనవమికి అందరిని ఎట్రాక్ట్ చేశారు.

 

ఈ కథ సాధారణంగా చూపిన పౌరాణిక శైలికి భిన్నంగా ఉంటుంది. భగవంతుడైన శ్రీరాముడు ఎలా ధర్మ స్థాపన కోసం సమరం చేశాడో, ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కూడా అదే ధ్యేయంతో సాగుతుంది. కానీ ఈ కథ సాంప్రదాయ పౌరాణిక చిత్రాలు లాగా కాకుండా, ఆధునిక చిత్రణతో, అత్యాధునిక విజువల్స్‌తో రూపొందనుంది. అఖిరా అనే మహానుభావుడి చరిత్రను చూపించే ఈ కథ ఇప్పటి వరకు భారతీయ సినిమా తెరపై ఎప్పుడూ చూడని విధంగా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ సినిమా రూపకల్పనను ఎంతో నమ్మకంగా, స్థిరంగా రూపొందిస్తున్నారు నిర్మాత వేణు దొనేపూడి. ఆయన మాట్లాడుతూ “శ్రీరాముని నామం ఈ దేశానికి ఒక మార్గదర్శక మంత్రం లాంటిది. ఆయన ధర్మాన్ని స్థాపించడమే కాదు, అధర్మాన్ని నాశనం చేయడంలో చూపిన ధైర్యమే ఈ కథకు ప్రేరణ. ఈ కథలో కూడా అదే పాఠాన్ని ఆధునిక కాలానికి అన్వయించి చూపించబోతున్నాం” అని చెప్పారు.

ఇందులో హీరో పాత్రను ఓ యువ టాలీవుడ్ నటుడు పోషించనున్నాడు. పేరును త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లే ప్రముఖ నటులు, టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందించబడుతున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాల్లో ఉంటుంది అని నిర్మాతలు చెబుతున్నారు.

మోషన్ పోస్టర్‌లో కనిపించిన అఖిరా వేషధారణ, చేతిలో జై శ్రీరామ్ పతాకం, గుర్రపు స్వారీ చూస్తేనే సినిమాలోని తత్వం స్పష్టమవుతోంది. రామం సినిమా రామరాజ్యాన్ని కొత్త కోణంలో వివరించబోతుందని అర్ధమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సినిమాతో టాలీవుడ్‌కు మరో గొప్ప విజువల్ ట్రీట్ రానుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News