రామ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?.. డైరెక్టర్ కే షాక్ ఇచ్చిన ఉస్తాద్!
ఇన్నాళ్లు మనం ఆయన్ని ఒక మంచి నటుడిగా, ఎనర్జిటిక్ స్టార్ గానే చూశాం. కానీ రామ్ లో ఎవరికీ తెలియని ఒక 'రచయిత' దాగున్నాడని చెబితే నమ్ముతారా? ఆ విషయం తెలిసి స్వయంగా డైరెక్టర్ కూడా షాక్ అయ్యారట.;
ఉస్తాద్ రామ్ పోతినేని అంటేనే హై వోల్టేజ్ ఎనర్జీ. స్క్రీన్ మీద ఆయన డాన్స్ వేసినా, డైలాగ్ చెప్పినా ఆ కిక్కే వేరు. ఇన్నాళ్లు మనం ఆయన్ని ఒక మంచి నటుడిగా, ఎనర్జిటిక్ స్టార్ గానే చూశాం. కానీ రామ్ లో ఎవరికీ తెలియని ఒక 'రచయిత' దాగున్నాడని చెబితే నమ్ముతారా? ఆ విషయం తెలిసి స్వయంగా డైరెక్టర్ కూడా షాక్ అయ్యారట. 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని దర్శకుడు మహేశ్ బాబు పి తాజాగా బయటపెట్టారు.
సాధారణంగా హీరోలు కథ వింటారు, షూటింగ్ కి వస్తారు. మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొనడం చాలా అరుదు. కానీ రామ్ మాత్రం ఈ సినిమా విషయంలో ప్రతి చిన్న విషయంలో కూడా కేర్ తీసుకున్నారు. ముఖ్యంగా మ్యూజిక్ సిట్టింగ్స్ కి కంపల్సరీగా వచ్చేవారట. అక్కడ రామ్ చూపించిన ఇన్వాల్వ్మెంట్ చూసి మ్యూజిక్ డైరెక్టర్లే కాదు, సినిమా దర్శకుడు కూడా ఆశ్చర్యపోయారు.
"నిజంగా రామ్ గారికి పాటలు రాసే టాలెంట్ ఉందని నాకు అస్సలు తెలియదు. ఆయనకి మ్యూజిక్ పట్ల మంచి నాలెడ్జ్ ఉంది" అని డైరెక్టర్ మహేశ్ బాబు చెప్పుకొచ్చారు. ఒకసారి ఒక ట్యూన్ గురించి చర్చిస్తున్నప్పుడు, ఆ సందర్భంలో ఉండాల్సిన ఎమోషన్ ను రామ్ తన మాటల్లో చెప్పారట. ఆ మాటలు ఎంత బాగున్నాయంటే.. అవి డైరెక్ట్ గా పాటలాగే అనిపించాయట.
ఆ ఎమోషన్ ను రామ్ వర్ణించిన తీరు నచ్చి, డైరెక్టర్ ఆయన్నే ఆ పాట రాయమని అడిగారట. అలా రామ్ కలం నుంచి వచ్చిందే "నువ్వుంటే చాలు" అనే బ్యూటిఫుల్ మెలోడీ. కేవలం పల్లవి రాయడమే కాదు, ఆ పాటలోని ఫీల్ ను రామ్ అద్భుతంగా క్యారీ చేశారు. అది సినిమాకు అన్ని విధాలా ప్లస్ అయ్యిందని, అనిరుధ్ గొంతు తోడవడంతో పాట నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిందని దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు.
కేవలం రాయడమే కాదు, ఈ సినిమాలో "పప్పీ షేమ్" అనే పాటను పాడి సింగర్ అవతారం కూడా ఎత్తారు రామ్. వివేక్ మెర్విన్ అందించిన సంగీతానికి, రామ్ ఇచ్చిన ఇన్పుట్స్ చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. హీరోగా బిజీగా ఉంటూనే, ఇలా లిరిసిస్ట్ గా, సింగర్ గా తనలోని మల్టీ టాలెంట్ ను బయటపెట్టి రామ్ ఈ సినిమాను తన భుజాలపై మోస్తున్నారు.
మొత్తానికి 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఆడియో సక్సెస్ వెనుక రామ్ పాత్ర చాలా ఉంది. ఒక అభిమాని ఎమోషన్ చుట్టూ తిరిగే ఈ కథలో, రామ్ రియల్ లైఫ్ టాలెంట్ కూడా యాడ్ అవ్వడం సినిమాపై అంచనాలు పెంచేసింది. నవంబర్ 27న రాబోతున్న ఈ సినిమాలో రామ్ ఇంకెన్ని సర్ప్రైజులు దాచారో చూడాలి.