రామ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
ఉస్తాద్ రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ తర్వాత త్వరలో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో రాబోతున్నాడు.;
ఉస్తాద్ రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ తర్వాత త్వరలో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ బాగున్నాయి. రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మహేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తుంది. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా నవంబర్ 29న రిలీజ్ ఫిక్స్ చేశారు. రామ్ ఈ సినిమాలో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తుంది. చిత్ర యూనిట్ ఐతే రామ్ యంగ్ లుక్ తోనే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఐతే సినిమాలో మరో సీరియస్ యాక్షన్ ఫేజ్ కూడా ఉంటుందని తెలుస్తుంది.
తన ఫోకస్ అంతా ఆంధ్రా కింగ్ తాలూకా మీదే..
రామ్ ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడని తెలుస్తుంది. అందుకే రిలీజ్ విషయంలో కూడా పోటీ పడటం.. తొందరపడటం లాంటివి కాకుండా పర్ఫెక్ట్ సోలో డేట్ లాక్ చేసుకున్నాడు. అంటే రామ్ లెక్క ప్రకారం సినిమా బాగుంటే అది మంత్ మిడిల్ అయినా సరే చూస్తారన్నట్టు అట. ఆంధ్రా కింగ్ తాలూకాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఉన్నారు. ఆయన సినిమాలో కూడా హీరో రోల్ లో కనిపిస్తారు.
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా తర్వాత రామ్ నెక్స్ట్ ఏం చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఈ సినిమా మీదే పెట్టిన రామ్ ఈ మూవీ రిలీజ్ తర్వాత నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిద్దామని అనుకుంటున్నాడు. రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో హిట్ కొట్టి మళ్లీ తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.
రామ్ లోని ఎనర్జీని సరిగా వాడుకుంటే..
రామ్ లోని ఎనర్జీని సరిగా వాడుకుంటే అద్భుతాలు చేయొచ్చు. అతని స్టోరీస్ సెలక్షన్ కూడా బాగుంటుంది. కానీ ఎందుకో రామ్ ఈమధ్య మళ్లీ ట్రాక్ తప్పాడు. ఆంధ్రా కింగ్ తో రామ్ హిట్ ట్రాక్ ఎక్కితే మాత్రం నెక్స్ట్ రాబోతున్న సినిమాలకు కూడా మంచి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి వచ్చిన నువ్వుంటె చాలే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.
రామ్, భాగ్య శ్రీ జోడీ కూడా సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంది. ఆంధ్రా కింగ్ తో అదరగొడితే నెక్స్ట్ రామ్ మరింత డబుల్ ఎనర్జీతో సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. రాం తో హరీష్ శంకర్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఐతే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాతే హరీష్ శంకర్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడో తెలుస్తుంది. సో రాం హరీష్ శంకర్ కాంబో సెట్ అయితే మాత్రం ఒక మంచి ఎనర్జిటిక్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.