ఆంధ్ర కింగ్ తాలూకా.. పర్ఫెక్ట్ డేట్ సెట్ చేసుకున్న రామ్!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది.;

Update: 2025-08-21 12:09 GMT

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న ఈ హీరో మరోసారి తన ఫ్యాన్స్ కి పండగ వాతావరణం తీసుకురానున్నారు. యంగ్ డైరెక్టర్ P మహేష్ బాబు దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఎట్టకేలకు స్పెషల్ పోస్టర్ తో రివిల్ చేశారు.

ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ తోనే సినిమా మీద మాస్ లెవల్ బజ్ క్రియేట్ అయింది. రామ్ ను ఒక డై హార్డ్ మూవీ లవర్ గా చూపించిన ఆ వీడియో ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ సింగిల్ 'నువ్వుంటే చాలే..' మరింత హైప్ ని తీసుకొచ్చింది. ఈ పాటను అనిరుధ్ రావిచందర్ పాడగా, లిరిక్స్ ను రామ్ పోతినేనియే రాశారు. డైనమిక్ మ్యూజిక్ డ్యూయో వివేక్ - మర్విన్ అందించిన మెలోడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.

ఇక ఈ రోజు రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో రామ్ స్టైలిష్, స్పిరిటెడ్ లుక్ లో కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ లో పేపర్ కటింగ్స్ ఎగురుతూ, జనాలు జోష్ లో కనిపించేలా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ చూస్తేనే థియేటర్లలో పండగ వాతావరణం మొదలైనట్లే అనిపిస్తోంది. ఇక సినిమాను నవంబర్ 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఒక ముఖ్యమైన ఫిల్మ్ స్టార్ పాత్రలో కనిపించనున్నారు. స్టార్ క్యాస్ట్ లో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీవీ గణేష్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కూడా భాగమయ్యారు. దీంతో కంటెంట్ కి తోడు నటీనటుల అద్భుతమైన ప్రదర్శన కూడా ఈ సినిమాకి బలం అవుతుందని చెప్పవచ్చు.

సినిమా టెక్నికల్ టీమ్ కూడా బలంగా ఉంది. కెమెరా పనులను సిద్ధార్థ నుని హ్యాండిల్ చేస్తుండగా, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా బాధ్యతలు తీసుకున్నారు. వీరంతా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన వారు కావడంతో సినిమాకి మరింత రిచ్ ఫీల్ వస్తుందని చెప్పాలి. ప్రస్తుతం ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ తో ప్రమోషన్లు మరింత వేగం కనిపించనుంది. వరల్డ్ వైడ్ రిలీజ్ తో రామ్ పోతినేని ఈసారి మరో బిగ్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తో పాటు ఎనర్జీ, స్టైల్, మాస్ అట్రాక్షన్ కలిపి రామ్ తన ఫ్యాన్స్ కి ఒక ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని అర్ధమవుతుంది. ఇక నవంబర్ 28న ఆంధ్ర కింగ్ తాలూకా థియేటర్లలో ఎలాంటి జోష్ చూపిస్తుందో చూడాలి.

Tags:    

Similar News