ఆంధ్ర కింగ్ తాలుకా.. అన్నింటికన్నా అదే స్పెషల్..
ఇప్పుడు నువ్వుంటే చాలే.. సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. వేరే లెవెల్ లో ఆకట్టుకుంటోంది.;
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు యూనిక్ ఎంటర్టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్ యలమంచిలి, నవీన్ ఎర్నేని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు వీరాభిమానిగా సినిమాలో రామ్ కనిపించనున్నారు. రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర ప్రముఖ నటీనటులు.. మూవీలో కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం మేకర్స్.. రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ లో క్రేజీ బజ్ కూడా క్రియేట్ చేసింది.
ఇప్పుడు నువ్వుంటే చాలే.. సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. వేరే లెవెల్ లో ఆకట్టుకుంటోంది. ఆ పాటకు స్వయంగా రామ్ లిరిక్స్ అందించగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఆలపించడం విశేషం. వివేక్, మెర్విన్ కంపోజ్ చేసిన ఆ సాంగ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఫిదా చేస్తోంది.
పర్ఫెక్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రామ్ అందించిన సాహిత్యం పోయెటిక్ గా, మనసుకు హత్తుకునేలా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా సాంగ్ కు రామ్ ఇచ్చిన లిరిక్స్, అనిరుధ్ వాయిస్, వివేక్- మెర్విన్ కంపోజిషన్ కన్నా.. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.
వారిది పెయిర్ ఆఫ్ ది సీజన్ అని ఇప్పుడు నెటిజన్లు అంటున్నారు. రామ్, భాగ్య శ్రీ జంట చాలా చూడముచ్చటగా ఉందని అనేక మంది కామెంట్లు పెడుతున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ సాంగ్ కే కాదు.. సినిమాకు కూడా ప్లస్ పాయింట్ కానుందని చెబుతున్నారు. అలా ఫస్ట్ సింగిల్ తో మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారనే చెప్పాలి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.