వివాదాస్పద నటుడికి 20 కోట్ల ఆస్తులు ఎక్కడివి?
రామ్ కపూర్ ఖరీదైన అభిరుచి ఉన్న నటుడు. మూడు విలాసవంతమైన ఇండ్లు, విలాసవంతమైన ఆస్తులు, హై-ఎండ్ కార్లతో అతడు లగ్జరియస్ జీవితాన్ని అనుభవిస్తున్నాడు.;
ఇటీవల ప్రముఖ హిందీ నటుడు రామ్ కపూర్ మీడియా ఎదుట అనుచిత వ్యాఖ్యలతో దొరికిపోయిన సంగతి తెలిసిందే. లైంగికతను ప్రస్థావిస్తూ చెడుగా మాట్లాడాడు. ఆ సమావేశంలో అతడి భాష వ్యవహార శైలి ఎవరికీ నచ్చలేదు. దీంతో `మిస్త్రీ` చిత్రబృందం అతడిని ప్రచార కార్యక్రమాల నుంచి తొలగించిందని కథనాలొచ్చాయి.
అయితే ఈ వివాదం అతడిని ఇంత బాగా ఫేమస్ చేస్తుందని అనుకోలేదు. ఇంతకుముందు అతడు చాలా సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఇప్పుడు అతడికి దక్కింది. అంతేకాదు.. ఈ నటుడు ఎంత సంపాదిస్తాడు? ఆస్తులు ఏవైనా ఉన్నాయా? అని కూడా గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అలాంటి వారి కోసం అతడి పూర్తి వివరాలు ...
రామ్ కపూర్ ఖరీదైన అభిరుచి ఉన్న నటుడు. మూడు విలాసవంతమైన ఇండ్లు, విలాసవంతమైన ఆస్తులు, హై-ఎండ్ కార్లతో అతడు లగ్జరియస్ జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అంతేకాదు నటుడిగా గొప్ప సంపాదకుడు అని అర్థమవుతోంది. రెండు హాలిడే గృహాలతో పాటు, ముంబై అలీబాగ్‌లో విలాసవంతమైన ఇల్లు అతడికి ఉన్నాయి. అలీబాగ్ ఇంటి విలువ దాదాపు రూ.20 కోట్లు. ఇదే కాదు.. గోవాలో ఒక ఇల్లు, ఖండాలాలో మరొక ఇల్లు కలిగి ఉన్నాడు.. అవి అతడి హాలిడే గృహాలు. రామ్ ఇటీవల తన వింత వైఖరితో పాటు, ఖరీదైన కొనుగోళ్లు, వివాదాలతో అభిమానులను అలరిస్తున్నాడు. రామ్ కపూర్ లగ్జరీ కార్లకు అభిమాని. రూ.4.57 కోట్ల విలువైన లంబోర్గిని ఉరుస్ రామ్ కపూర్ సొంతం చేసుకున్నాడు. అతడు చాలా హై-ఎండ్ కార్లలో ప్రయాణిస్తాడు.
తాజా వివాదంపై రామ్ కపూర్ మాట్లాడుతూ... నా సొంత మనుషులు అనుకున్న చోట తాను ప్రతిదీ ఓపెనవుతానని, అయినా నేను దోషిగా ఉన్నానని అతడు స్పందించాడు. నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ నేనేంటో తెలుసు. అయితే నేను అభ్యంతరకరంగా ఉండకూడదని తెలుసుకున్నాను! అని అన్నాడు. `బడే అచ్చే లగ్తే హై` చిత్రంలో తన నటనతో రామ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఘర్ ఏక్ మందిర్, కసం సే లాంటి చిత్రాల్లోను అద్భుతంగా నటించాడు.