• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెద్ది తర్వాత చరణ్ బిగ్...

పెద్ది తర్వాత చరణ్ బిగ్ ప్లాన్.. లైన్ లోకి మరో స్టార్ దర్శకుడు!

| పెద్ది సినిమాతో మళ్లీ మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే స్టార్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

By - Tupaki Desk
Update: 2025-05-28 07:18 GMT

పెద్ది సినిమాతో మళ్లీ మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే స్టార్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2026 మార్చిలో విడుదల కానుంది. భారీ స్థాయిలో నిర్మాణమవుతున్న ఈ చిత్రం ఒక పాన్ ఇండియా విజన్‌తో రూపుదిద్దుకుంటోంది. ఇందులో చరణ్‌ క్యారెక్టర్ కూడా పూర్తి భిన్నంగా ఉండనుందని టాక్.

ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న పెద్ది సినిమా పూర్తయితే, తదుపరి ప్రాజెక్టులపై చరణ్ దృష్టి పెట్టనున్నాడు. ఈ సినిమాకి తర్వాత, సుకుమార్‌తో రామ్ చరణ్ మళ్లీ జతకట్టనున్నాడు. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ కాంబినేషన్‌పై అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయి. కథా పరంగా భారీ ఎమోషనల్ డ్రామా, ఊహించని లెవెల్లో మేకింగ్ ఉండబోతోందట. అయితే, సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉండటంతో, చరణ్ సినిమా ప్రారంభం ఆలస్యం కావొచ్చని టాక్. ఇదే సమయంలో చరణ్ మరొక స్టార్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ టాక్ ప్రకారం రామ్ చరణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా 2026 మధ్యలో సెట్స్ మీదకి వెళ్ళబోతోందట. ఈ ప్రాజెక్ట్‌కి కొత్త ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ వస్తోంది. ముందుగా వెంకటేశ్‌తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాతే చరణ్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. అలా అయితే, త్రివిక్రమ్ అల్లు అర్జున్ పౌరాణిక చిత్రం మరింత ఆలస్యం కావడం ఖాయం.

చరణ్ ప్రాజెక్ట్ లైన్‌లోకి రావడం, సుకుమార్ సినిమా ఆలస్యం కావడం అన్నీ కలిస్తే, త్రివిక్రమ్ సినిమా ముందే సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందన్న చర్చ ఫిల్మ్ నగర్‌లో గట్టిగానే వినిపిస్తోంది. త్రివిక్రమ్ శైలిలో వినోదం, భావోద్వేగం, మాటల మేజిక్ ఉంటే, చరణ్‌ స్టైల్‌లో మాస్ యాక్షన్ మిక్స్ అవుతూ ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇచ్చేలా ప్లాన్ జరుగుతోందట. ఇప్పటి వరకూ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. కనుక ఇది మెగా ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

కథ పూర్తి కాగానే కాస్టింగ్ ఫైనల్ చేస్తారనే సమాచారం. చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ పూర్తిచేసేందుకు బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు, సుకుమార్, త్రివిక్రమ్.. ఇలా వరుసగా సుదీర్ఘ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకోవడం చూస్తుంటే, ఆయనకు రాబోయే రెండేళ్లు చాలా హెక్టిక్‌గా ఉండనున్నాయి. అధికారిక ప్రకటనల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    
  • RamCharan 
  • MegaPowerStar 
  • PeddiMovie 
  • Sukumar 
  • Trivikram 
  • TollywoodUpdates 
  • SouthCinema 
  • MassAppeal 
  • MegaFans 
  • JanhviKapoor 
  • RC17 
  • Filmindustry 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS