బిలియ‌నీర్ పెళ్లిలో ట్రంప్ వ‌ర్సెస్ RRR స్టార్

ఇక ఇదే వేదిక‌పై ఆర్.ఆర్.ఆర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా అహూతుల దృష్టిని ఆక‌ర్షించాడు.;

Update: 2025-11-24 06:43 GMT

ఫార్మాసూటిక‌ల్ దిగ్గ‌జం, బిలియ‌నీర్ రామ‌రాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన‌, వంశీ గాది రాజు వివాహం ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ పెళ్లిలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియ‌ర్ ట్రంప్ తో పాటు, పాప్ సింగ‌ర్ జెన్నిఫ‌ర్ లోపేజ్, జ‌స్టిన్ బీబ‌ర్ త‌దిత‌ర ప్ర‌ముఖులు పాల్గొన్నారు. జెలో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ పెళ్లి వేడుకలో హైలైట్ గా మారింది. నవంబ‌ర్ 22 నుంచి మూడు రోజుల పాటు సాగిన ఈ పెళ్లిలో అతిథుల జాబితా అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంది.

ఇక ఇదే వేదిక‌పై ఆర్.ఆర్.ఆర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా అహూతుల దృష్టిని ఆక‌ర్షించాడు. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం పెద్ది చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. అందువ‌ల్ల ఇదే లుక్ తో అత‌డు పెళ్లికి వెళ్లాడు. వేడుక‌లో `పెద్ది` లుక్ అంత‌ర్జాతీయంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. గ్రాండ్ వెడ్డింగ్ లో డోనాల్డ్ ట్రంప్ జూనియర్ స‌హా ఇతరులను చ‌ర‌ణ్‌ కలిశాడు. ఇక ఇదే పెళ్లిలో షాహిద్ క‌పూర్, ర‌ణ్ వీర్ సింగ్, అన‌న్య పాండే స‌హా ప‌లువురు బాలీవుడ్ స్టార్లు త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకున్నారు.

హై ప్రొఫైల్ పెళ్లి కోసం చ‌ర‌ణ్ ఎంపిక చేసుకున్న బ్లాక్ సూట్ అత‌డిని అంద‌రిలోను ప్ర‌త్యేకంగా నిల‌బెట్టింది. అత‌డు దిగ్గ‌జాల న‌డుమ ఎంతో రాయల్‌గా షార్ప్ గా క‌నిపించాడు. ముఖ్యంగా పెద్ది కోసం ఎంపిక చేసుకున్న‌ గడ్డం లుక్ అత‌డిలోని ఆకర్షణను మరింత పెంచింది. సెల‌బ్రిటీ వెడ్డింగ్ నుంచి చ‌ర‌ణ్ ఫోటోలు వేగంగా వైర‌ల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అత‌డి అప్పియ‌రెన్స్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్, ఐఐఎఫ్ఏ వ్యవస్థాపకుడు ఆండ్రీ టిమ్మిన్స్‌తో సహా దిగ్గ‌జాల‌ను చ‌ర‌ణ్‌ కలుసుకుని పలకరించాడు. ఉద‌య్ పూర్ (రాజ‌స్థాన్)లో ఈ వివాహ వేడుక‌లు అత్యంత వైభ‌వంగా ఈ ఆదివారం నాటికి ముగిసాయి. న‌వ‌వ‌ధూవ‌రులు నేత్ర‌-వంశీ గాదిరాజు జంట‌కు ప్ర‌ముఖుల ఆశీస్సులు అందాయి.

రామ్ చ‌ర‌ణ్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, అత‌డు `పెద్ది` పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయాల్సి ఉంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. బుచ్చిబాబు స‌న ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విలేజ్ నేప‌థ్యంలోని స్పోర్ట్స్ డ్రామా 27 మార్చి 2026న విడుదల కానుంది. పెద్ది త‌ర్వాత చ‌ర‌ణ్ న‌టించే సినిమాకి సంబంధించిన వివ‌రాలు ఇంకా వెల్ల‌డి కాలేదు.

Tags:    

Similar News