ఆ గ్యాప్‌లో చ‌ర‌ణ్‌ని లాక్ చేస్తాడ‌ట‌

అలాంటి ఒక కాంప్లికేటెడ్ స‌న్నివేశంలో రామ్ చ‌ర‌ణ్‌- సందీప్ రెడ్డి వంగా- మైత్రి మూవీ మేక‌ర్స్ సినిమా క‌న్ఫామ్ అయ్యే ఛాన్సుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.;

Update: 2025-06-13 04:07 GMT

కొంత గ్యాప్ దొర‌కాలే కానీ ఆ గ్యాప్‌ని కూడా స‌ద్వినియోగం చేసుకోగ‌ల స‌మ‌ర్థ‌త మ‌న ద‌ర్శ‌కుల‌కు ఉంది. కొన్ని ప్రాజెక్టులు అనుకున్న స‌మ‌యానికి జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు. కొన్ని అటూ ఇటూగా జ‌రుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ద‌ర్శకుడు బిజీ కావొచ్చు.. హీరోకి స‌మ‌యం ఉండొచ్చు.. లేదా ఒక్కోసారి హీరో బిజీ కావొచ్చు.. ద‌ర్శ‌కుడు వ‌ర‌స ప్రాజెక్టుల‌తో లాక్ అయి ఉండొచ్చు. అలాంటి స‌న్నివేశంలో స‌ర్ధుబాటు అప్ప‌టికి కాల‌మే డిసైడ్ చేస్తుంది.

అలాంటి ఒక కాంప్లికేటెడ్ స‌న్నివేశంలో రామ్ చ‌ర‌ణ్‌- సందీప్ రెడ్డి వంగా- మైత్రి మూవీ మేక‌ర్స్ సినిమా క‌న్ఫామ్ అయ్యే ఛాన్సుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. చాలా కాలం క్రితం మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ‌ సందీప్ వంగాకు అడ్వాన్స్ చెల్లించింది. మైత్రితో సందీప్ వంగా సినిమా ఏదో ఒక స‌మ‌యంలో జ‌ర‌గొచ్చు. అత‌డు ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో స్పిరిట్ కోసం ప‌ని చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ర‌ణ‌బీర్ క‌పూర్ తో యానిమ‌ల్ సీక్వెల్ యానిమ‌ల్ పార్క్ ని పూర్తి చేయాల్సి ఉంది. కానీ ర‌ణ‌బీర్ వ‌రుస‌గా మూడు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. వీటిలో రామాయ‌ణం, ల‌వ్ అండ్ వార్ ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. త‌దుప‌రి య‌ష్ రాజ్ ఫిలింస్ లో ధూమ్ 4 సెట్స్ లో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ భారీత‌నంతో తెర‌కెక్కే చిత్రాలు.

అందువ‌ల్ల క‌పూర్ కి మ‌రో రెండేళ్ల స‌మ‌యం పైగానే అవ‌స‌రం. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో మైత్రి సంస్థ సందీప్ వంగా తో సినిమాని ప్లాన్ చేయ‌నుంద‌ని స‌మాచారం. రామ్ చ‌ర‌ణ్‌- సందీప్ వంగా కాంబినేష‌న్ సినిమాని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్లాన్ చేయాల్సి ఉంటుంద‌ని మైత్రి భావిస్తోంద‌ట‌. చ‌ర‌ణ్ కి ఇప్ప‌టికే మైత్రి బ్యాన‌ర్ ట‌చ్ లో ఉంది. సందీప్ వంగా వైపు నుంచి చ‌ర‌ణ్ విష‌యంలో ఆస‌క్తి ఉంది. అయితే అత‌డు చ‌ర‌ణ్ కోసం స‌రైన స్క్రిప్టును రెడీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడే మాట్లాడుకోవ‌డం స‌రికాదు. సందీప్ వంగా కానీ మైత్రి మూవీ మేక‌ర్స్ నుంచి కానీ అధికారిక ప్ర‌క‌ట‌న‌ వెలువ‌డాల్సి ఉంటుంది.

Tags:    

Similar News